రోజుకు కేవలం రూ.70తో చేతికి రూ.50 లక్షలు!LIC అదిరే పాలసీ
మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ ప్లాన్ ఎంచుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఈ పాలసీ తీసుకోండి. ఈ ఎల్ఐసీ పాలసీ వల్ల అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రధానాంశాలు: ఎల్ఐసీ నుంచి అదిరే పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ వీలైనంత తర్వగా తీసుకుంటే మేలు దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. ఎల్ఐసీలో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంద. అందుకే ప్రజల్లో ఎల్ఐసీపై విశ్వాసం ఎక్కువ. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల చాలా భవిష్యత్‌లో ప్రయోజనం పొందొచ్చు. కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది ఎల్ఐసీలో పలు రకాల పాలసీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒక భాగంగానే చెప్పుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల రోజుకు రూ.70 ఆదా చేయడంతో చేతికి ఏకంగా రూ.50 లక్షలు పొందొచ్చు. కనీసం 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా 35 ఏళ్ల వరకు పాలసీ ప్రీమియం చెల్లించొచ్చు. కనీసం రూ.లక్ష మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అం...