జీవిత బీమా
pc: Life.futuregenerali.in జీవిత బీమా అంటే పాలసీదారునికి, బీమా సంస్థకు మధ్య జరిగే ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం బీమా సంస్థ ముందుగా కొంత సొమ్మును తీసుకుని, బీమా చేయబడిన వ్యక్తి (సాధారణంగా పాలసీదారు) మరణిస్తే దానికి బదులుగా ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు నిర్దేశించబడిన లబ్దిదారులకు, (నామినీ గానీ, అప్పాయింటీ గానీ, అసైనీ గానీ, లీగల్ హేర్ గానీ) పెద్దమొత్తంలో ధనం (పరిహారం) చెల్లిస్తుంది. ఒప్పందాన్ని బట్టి కొన్నిసార్లు మరణానికి దారితీసే జబ్బులు సంక్రమించినపుడు, లేదా తీవ్ర అనారోగ్యం సంక్రమించినపుడు కూడా చెల్లింపులు ఉండవచ్చు. ఇందుకోసం పాలసీదారు సాధారణంగా ఒక ప్రీమియం సొమ్మును నిర్ణీత కాలవ్యవధిలోనో లేదా అంతా ఒక్కసారే చెల్లిస్తాడు. కొన్ని సందర్భాల్లో అంత్యక్రియల ఖర్చులు వంటి ఇతర ఖర్చులను కూడా ప్రయోజనాలలో చేర్చవచ్చు. జీవిత బీమా చట్టపరమైన ఒప్పందం. చట్టం దీనికి రక్షణ కల్పిస్తుంది. ఈ ఒప్పందంలో బీమా ఏయే పరిస్థితుల్లో వర్తిస్తుందో నిబంధనల రూపంలో ఉంటాయి. బీమా సంస్థల బాధ్యతను పరిమిత...