మందపల్లి శ్రీనివాసులు
మందపల్లి శ్రీనివాసులు నంబులపూలికుంట మండలం లోని పెడబల్లి గ్రామంలో 1.7.1963న రామప్ప శివమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం పెడబల్లి పాఠశాల లో ఉన్నత విద్యాభ్యాసం నంబులపూలికుంట లో ఇంటర్ కదిరి బాలుర జూనియర్ కళాశాల లో తర్వాత బీకాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. కదిరి లో ఉన్నప్పుడు అక్క సిద్దేశ్వరి గారింట్లో ఉండి చదువు కున్నారు.ఆమె ఆశీస్సులతోనే శ్రీనివాసులు జీవితం ముందుకు సాగింది.అన్న పెరుమాళ్లు అన్ని విధాల సహాయాన్ని అందించారు. డిగ్రీ పూర్తయ్యాక సర్వీస్ ఫార్మా కంపెనీలో 500 రూపాయల నెలసరి వేతనానికి మెడికల్ సేల్స్ మెన్ గా చేరారు 1986 లో. మునిరామయ్య, సరో జమ్మ దంపతుల కూతురు మంజులను 7.2.1988 లో వివాహం చేసుకున్నారు.వారికి అనూష, ప్రణీత్ లు జన్మించారు. 20.1.89న జన్మించిన అనూష బీటెక్ ఎంబీఏ పూర్తి చేసి వివాహం చేసుకొని బెంగుళూరులో స్థిరపడినారు. 5.5.90 న జన్మించిన ప్రణీత్ ఐటిఐ డిప్లమా పూర్త...