ప్రగతి సాధనకు పది సూత్రాలు
photo: pinterest “సాకులు చెప్పి, వాయిదాలు, వేసి, తర్కాలు చేసి ఎవ్వరు విజయం సాధించలేదు” బీమా ఏజన్సీ ఒక అద్భుతమయిన వృత్తి మనిషిలోని శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి, మనిషి లోపల దాగిన అసలు సిసలైన వ్యాపారనైపుణ్యాన్ని వెలికితీసే వృత్తి. అత్యంత కష్టతరమైన వృత్తి కూడా ఇదే. పట్టు దొరికిన తరువాత అమిత సులభమైన వృత్తి కూడ అదే. అయితే విజయాన్ని సాధించాలన్నా, ఏజంటుగా ఒక స్థాయికి ఎదగాలంటే, పట్టుదల, కృషి మాత్రమే చాలదు. మానవసంబంధాలను మెరుగు పరుచుకోవాలి. pc: pinterest మనం సంఘంలో జీవిస్తున్నాం. ఈ సంఘంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విషయానికి ప్రాముఖ్యత యిస్తుంటారు. బీమా ఏజంటు అన్ని రకాలైన మనుషులతో, అన్ని రంగాలలో వున్ననారితో మంచి సంబంధాలు కలిగి వుండాలి.ఏఅంశంలో ఆసక్తి వుంటుందో ఆ విషయాన్ని గురించి చర్చించి వారితో మాట్లాడే అవకాశాన్ని పెంచుకోవాలి. అప్పుడే బీమా అమ్మకం సులభమవుతుంది. బీమా ఏజన్సీనే ప్రధాన వృత్తిగా స్వీకరించిన ఏజంటు కొన్ని రకాల...