Posts

Showing posts from July, 2020

నేను మీ LIC పాలసీని.

Image
నేను రోల్ ఐ సి పాలసీ ని.  ఈ ప్రపంచంలో మనిద్దరి పనులు ఒకటే.   మీ కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం కల్పించడం మీ పని.  మీ ప్రియమైనవారు చదువుకోవడానికి, అనారోగ్యం వస్తే మందులకు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సమకూరుస్తున్నారు.  నేనప్పుడు మీ బీరువాలో భద్రంగా పడుకో నుంటాను.  మీ మీద నాకెంతో నమ్మక ముంది.   మీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో నన్నూ అలాగే చూసుకుంటారని. మీ సంపాదనలోంచి నా కోసం కొంత ఖర్చు చేస్తారు కదూ.          కొన్ని సమయాల్లో  మీకనినిపించవచ్చు  నేనెందుకు పనికిరానిదానని. కాని  ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు  నీ బాధ్యతను నేను తీసుకుంటానేమో.  మీరు  ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు, నేను లేచి వచ్చి పని చేస్తాను.  మీ పనిని.  అప్పుడు మీ కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం, విద్య వైద్యం  ఇలా ఎన్నో ఎన్నెన్నో వారి అవసరాలను తీరుస్తాను.  మీరిప్పుడు చేస్తున్నట్లే విరామమెరుగని మీ పరిశ్రమ పూర్తయినప్పుడు, నే నప్పుడు మీకు చేదుడువాదోడునవుతాను.   మీ చేతులుగా మారి మీ కనుపాప...

LIFE INSURANCE POLICY

Image
                        I AM                         YOUR        LIFE INSURANCE POLICY!                     You and I have similar purposes in this world.           It is your job to provide food, clothing, shelter,schooling, medicine, and other things for your loved ones. You do this while I lie in your strong box.       I have faith and trust in you. Out of your earnings will come the cost of my upkeep. At times, I may appear to be worthless to you - but some day (and who knows WHEN), you and I will change places.        When you are laid to rest, I will come alive and do your job. I will provide the food, clothing, shelter, schooling, medicine, and other things your family will continue to need - just as you are doing now...

విజయానికి కొన్ని పద్దతులు

Image
విజయాన్ని సాధించడానికి కొన్ని పద్దతులు పాటించాలి.         ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి ఒక హేతుబద్ధమైన లక్ష్యం ఏర్పరచుకోవాలి.ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి.         ప్రతిరోజు చేయాల్సిన పనులను ఎప్పటి కప్పుడు రూపొందించుకొంటూ ఉండాలి.వాటిని పూర్తి చేస్తూ ఉండాలి.       ఈ రోజు పనిని ఈరోజే పూర్తి చేయాలి.        కష్టమైన పనిని మొట్టమొదట పూర్తి చేయాలి.              కలుసుకోబోయే వ్యక్తుల గురించి తెలుసుకొని వారి పేర్లు ఒక చిన్న పుస్తకం లో రాసి పెట్టుకోవాలి. వారి చరవాణి( మొబైల్) నంబరును తప్పకుండా రాసి పెట్టుకోవాలి.        వ్యక్తులను ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు కలిసి వారి గురించి  సాధ్యమైనంత సమాచారం ఎక్కువగా తెలుసుకోవాలి.      అనుకున్న సమయానికి వారిని కలుసుకోనేలా బయల్దేరాలి.     పాలసీలు చేయించబోయే వ్యక్తుల దగ్గర సాధ్యమైనంత ఎక్కువగా మీరు చెప్పదలచు కొన్న విషయాన్ని సమర్ధవంతంగా, ఆకట్టుకొనేలా చెప్పాలి.    ‌ ...

మూడు సూత్రాలు

Image
న్యూటన్ గమన సూత్రాల్లాగా జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే మూడు అతి ముఖ్యమైన సూత్రాలున్నాయి. వీటిలో  మొదటిది - సంకల్పం,  రెండోది - లక్ష్య సాధన పట్ల అవగాహన,    మూడోది - ప్రకృతిపై భారం వేయడం.         ఒక పనిని మన కృషితో సాధించ సాధ్యం కానప్పుడు దానిని  ప్రకృతి మేథస్సుకు ఆనందంగా వదలి సరైన సమయం కొరకు వేచి ఉండాలి. మనం ఎక్కుపెట్టిన బాణం,ధనస్సు నుండి విడివడి లక్ష్యాన్ని కొట్టాలంటే ఈ మూడింటి పైన తప్పనిసరిగా దృష్టిని కేంద్రీకరించాలి. ఇవి కేవలం మన లక్ష్య సాధన విషయంలోనే కాకుండా, మన జీవితకాలమంతా  అన్ని వేళలా అవసరమవు తాయి. డబ్బు సంపాదన అన్న లక్ష్యం విషయంలో ఈ మూడుతిరుగులేని అస్త్రాలుగా ఎదురులేని శస్త్రాలుగా పనిచేస్తాయి. పిళ్లా కుమారస్వామి 9490122229

అపనమ్మకానికి గంతలు కట్టాలి

Image
          బురదగుంటలో దిగబడిపోయిన తన కారును చూసి నిట్టూర్చాడు రామ్.ఆక్సిలరేటర్ బలంగా నొక్కాడు. బురదలో కూరుకున్న కారు చక్రాలు గిర్రున తిరిగాయి. కాని అవి మరింత కూరుకు పోయాయి. ఇక లాభం లేదనుకుని కకారు ఆపు చేసి కిందకు దిగాడు రామ్.       సాయంకోసం చుట్టూ చూశాడు. దూరంగా ఓ రైతు కనపడ్డాడు.ఆ రైతు సాయం అడిగాడు.      పరిస్థితి చూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బయటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు.        దాన్నిచూడగానే ఆ రామ్ నిరాశతో ఉసూరుమంటూ పక్కన కూర్చున్నాడు.        రైతు ఆ ముసలిఎద్దును కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ 'రాజూ', 'అంజీ', 'నందీ'ఏంట్రా ఆలోచిస్తున్నారు తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! ఆ ముసలి బక్క ఎద్దు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది,,,. ఆ కారు పెద్దాయన ఆశ్చర్యంతో,  ' ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటి, అన్ని ఎద్దులు ఉన్నట్టు అదిలించారు?...అయినా ఆ బక్క ముసలి ఎద్దు ఎలా ఈ కారును లాగింది"".?  అని ఆశ్చర్...