మీకు ఎంత జీవిత బీమా అవసరం..! ఇలా తెలుసుకోండి.
pc: Sakshi.com కోవిడ్-19 మహమ్మారి రాకతో చాలా మంది జీవితాలు చిద్రమైపోయాయి. కరోనా చూపిన ప్రభావం చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాల్లో బీమా పాలసీలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్గింది. కాగా కరోనా రాకతో ఇప్పుడు చాలా మంది పాలసీలను తీసుకోవడానికి సన్నద్దమవుతున్నారు. ఏలాంటి పాలసీలను తీసుకోవాలనే సందిగ్ధంలో నెలకొని ఉన్నారా..! అయితే ఇది మీకోసమే. ఏజెంట్లు చెప్పే మాయమాటలకు నమ్మకుండా మీ సొంతంగా ఏ పాలసీ మీకు సరిపోతుందో తెలుసుకోండి. బీమా తీసుకోవడంతో అనుకొని దురదృష్టకర సంఘటనల నుంచి మనల్ని మనం కాస్త కాపాడుకున్నా వాళ్లం అవుతాం. మీ జీవిత బీమాను తెలసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవిత బీమా ముందుగా మీకు వచ్చే వార్షిక ఆదాయంపై ఆధాపడి ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రస్తుత వయసు, పదవీ విరమణ పొందే వయసుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే అంత మంచిది మీకు ఎంత బీమా అవసరం.. అనే అంచనాలను ఇలా వేయండి. మీరు తీసుకునే వ్యక్తిగత జీతం నుంచి మీ వ్యక్తిగత ఖర్చులను తగ్గించడం ద్వారా మీ కుటుంబ నెల...