ఎల్ఐసి లిస్టింగ్
pc: livemint.com 2021 జనవరి 19 నాటికి దేశంలో బీమా రంగం జాతీయకరణ చేసి 65 సంవత్సరాలు. 245 ప్రైవేటు, విదేశీ బీమా కంపెనీల మోసాలకు, దోపిడీకి తెరపడిన రోజు. ఆ రోజు బీమా రంగాన్ని జాతీయకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తెస్తూ ప్రకటన తెచ్చింది. తదనంతరం 01.09.1956 తేదీన LIC దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించింది. ఈ నేపధ్యంలో జనవరి 19 మనకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ఇచ్చే రోజు. మనం జాతీయకరణ లక్ష్యాలకు పునరంకితం అయ్యే రోజు. బీమా రంగ జాతీయీకరణ యధాలాపంగా జరగలేదు. ఒక ప్రభుత్వ విధానంగా జరగలేదు. దానికో చారిత్రిక పునాది వుంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిలో జాతీయీకరణ ఒక కీలక పార్శ్వం. రాజకీయ స్వాతంత్ర్యం చాలదు, ఆర్థిక స్వాతంత్ర్యం కీలకం అనే తాత్విక అవగాహనే జాతీయీకరణ మూల సూత్రం. అందుకే భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ 1931 తీర్మానం, 1948 లో రాజ్యాంగ పరిషత్తు వక్కాణింపు, 1955 అవాడి జాతీయ కాంగ్రెస్ మహాసభ తీర్మానం సారాంశం ఇదే. ఇందులో భాగమే బీమా రంగ జాతీయకరణ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి పెద్దలు డిమాండ్ చేసింది ఇదే. LIC దేశాభి...