ఎల్ఐసి లిస్టింగ్


   pc: livemint.com
2021 జనవరి 19 నాటికి దేశంలో బీమా రంగం జాతీయకరణ చేసి 65 సంవత్సరాలు. 245 ప్రైవేటు, విదేశీ బీమా కంపెనీల మోసాలకు, దోపిడీకి తెరపడిన రోజు. ఆ రోజు బీమా రంగాన్ని జాతీయకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తెస్తూ ప్రకటన తెచ్చింది. తదనంతరం 01.09.1956 తేదీన LIC దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఆవిర్భవించింది. ఈ నేపధ్యంలో జనవరి 19 మనకు స్ఫూర్తినీ, ఉత్తేజాన్నీ ఇచ్చే రోజు.   మనం జాతీయకరణ లక్ష్యాలకు పునరంకితం అయ్యే రోజు. 

బీమా రంగ జాతీయీకరణ యధాలాపంగా జరగలేదు. ఒక ప్రభుత్వ విధానంగా జరగలేదు. దానికో చారిత్రిక పునాది వుంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిలో జాతీయీకరణ ఒక కీలక పార్శ్వం. రాజకీయ స్వాతంత్ర్యం చాలదు, ఆర్థిక స్వాతంత్ర్యం కీలకం అనే తాత్విక అవగాహనే జాతీయీకరణ మూల సూత్రం. అందుకే భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ 1931 తీర్మానం, 1948 లో రాజ్యాంగ పరిషత్తు వక్కాణింపు, 1955 అవాడి జాతీయ కాంగ్రెస్ మహాసభ తీర్మానం సారాంశం ఇదే. ఇందులో భాగమే బీమా రంగ జాతీయకరణ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి పెద్దలు డిమాండ్ చేసింది ఇదే. 

 LIC దేశాభివృద్ధికి నిధులు అందిస్తోంది. పాలసీదారులకు మెరుగైన రాబడిని, అసమానమైన భద్రతనూ అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విస్తరించింది. ఫిర్యాదులు లేకుండా క్లెయిమ్స్ పరిష్కరిస్తోంది. నమ్మకమే పునాదిగా పనిచేస్తున్నది. అంతై ఇంతై వటుడింతింతైనట్లు LIC నేడు 32 లక్షల కోట్లు ఆస్తులున్న సంస్థగా ఎదిగింది. 42 కోట్ల మంది పాలసీదారుల సేవలో తరిస్తున్నది. 135 కోట్ల మంది భారతీయుల ఆదరణ చూరగొన్నది. ప్రైవేటు బీమా కంపెనీలయొక్క  అనైతిక పోటీని తట్టుకుని 73 శాతం వాటాతో మార్కెట్ లీడర్ గా, మార్కెట్ మేకర్ గా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్నది 

1971 లో సాధారణ బీమారంగ  జాతీయకరణ, GIC ఏర్పాటైంది.


5 కోట్ల ప్రారంభ పెట్టుబడితో 1956 లో ఎల్ ఐ సి ని ఏర్పర్చారు. ఐ ఆర్ డి ఏ నిబంధనలకు అనుగుణంగా దీన్ని 2011 లో 100 కోట్లకు పెంచారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ 67 ఏళ్ళలో సాల్వన్సీ మార్జిన్ కొరకు గానీ, వ్యాపారాభివృద్ధికి గాని ప్రభుత్వం పెట్టుబడులు ఏమీ పెట్టలేదు. ఎల్ ఐ సి తన అంతర్గత వనరుల నుంచే వీటికి పెట్టు బడులను సమకూర్చుకుంది. కాబట్టి ఎల్ సిని ఒక మ్యూచువల్ బెనెఫిట్ ఇన్సురెన్స్  కంపనీ గా భావించాలి. ఎల్ ఐ సికి ఖర్చులు పోను వచ్చిన మిగులు (సర్ ప్లస్) లో 95% పాలసీదారులకు 5% ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి పాలసిదారులే నిజమైన యజమానులని చెప్పాలి. ప్రభుత్వం వాటా కలిగి ఉన్న మైనారిటీ షేర్ హెల్డర్ అని చెప్పాలి. కానీ
LIC లాంటి గొప్ప సంస్థపై కేంద్ర ప్రభుత్వం దాడి పెంచింది. పసలేని కారణాలు చెబుతూ LIC IPO తీసుకురావాలని, మకుటాయమానమైన ఈ సంస్థను స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. 

      ఎల్ ఐ సిలో వాటాల అమ్మకం ప్రక్రియ పాలసిదారుల సమ్మతితో వాళ్ళని సంప్రదించి చెయ్యాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం కార్పోరేట్ లాభాల కొరకే జరుగుతుందని ప్రజలు గమనించాలి.

      లిస్టింగ్ ఎల్ఐసి ని బలహీన పరుస్తుంద నడంలో సందేహం లేదు. ఎల్ ఐ సి ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తాలను సేకరించి వాటిని దేశాభివృద్ధికి ఉపయోగిస్తుంది. 1956 లో ఎల్ ఐ సి ప్రారంభమైనప్పటి నుంచి కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని సాధించింది. జీవిత బీమా వ్యాపారం లో ఎల్ఐసి ఈ 64 ఏళ్ళలో ఎన్నో మైలు రాళ్ళను దాటింది. ఈ రోజు ఎల్ఐసి ఆస్థుల విలువ 31 లక్షల కోట్ల రూపాయ లను దాటింది. 40 కోట్ల పాలసీ దారులతోఎల్ఐసి ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత బీమా కంపనీగా ఉన్నది.

ప్రైవేట్ కంపనీలు వచ్చిన 20 ఏళ్ళు తర్వాత కూడా ఎల్ ఐ సి మార్కెట్ షేర్ పాలసీలలో 73% గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు అవసరమైన వనరులలో 25% ఎల్‌ని నమకూరుస్తుంది. 2019-20 నాచీ వరకు ఎలసి ప్రభుత్వ వాటా క్రింద 28, 700 కోట్ల రూపాయలను డివిడెండ్స్ అందించింది. 

దేశంలో మౌలిక వసతుల కల్పనకు మరియు సామాజిక పెట్టుబడులకు ఎల్ ఐ సి పెట్టుబడులు చాల కీలకం. ఎల్ ఐ సి లో వాటాలు అమ్మితే వనరుల సేకరణ కష్టమవుతుందనడం లో సందేహం లేదు. బంగారు గుడ్లు పెట్టి బంగారు బాతు లాంటి ఎల్ ఐ ని ని ధ్వంసం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు ఎంత శాతం వాటాలను అమ్మాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక సారి లిస్టు అయిన కంపెనీలో కనీసం 25% వాటా లను అమ్మాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రానున్న కొన్ని సంవత్స రాలలో ఎల్ ఐ సీ వాటాలను కనీసం 25% విక్రయించాల్సి ఉంటుంది. అంటే ఎల్ ఐ సి యొక్క పబ్లిక్ రంగ స్వభావానికి, ఎల్ ఐ సి అస్తిత్వానికి పెను ప్రమాదం పొంచి ఉందని అర్థం ఎల్ ఐ సి లో వాటాల విక్రయం దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సామాన్య ప్రజల జీవనాల పై ప్రతికూల ప్రభావం చూపి స్తుంది. బీమా రంగ జాతీయకరణ లక్ష్యాలు వెనకబడిపోయి ఎల్ ఐ సి తన షేర్ హెూల్డర్ల లాభాల కొరకై పని చేయ్యాల్సి వస్తుంది. లాభాలు ఎక్కువగా వచ్చే పెద్ద మొత్తాల్లో ఉన్న పాలసీల పై ఎల్ ఐ సి కేంద్రీ కరించాల్సి ఉంటుంది. దీని వల్ల పేదలు, దిగువ మధ్య తరగతి ఎక్కువగా తీసుకొనే చిన్న మొత్తాల పాలసీల అమ్మకం తగ్గి అల్ప ఆదాయ వర్గాల వారికి బీమా తగ్గిపోయే ప్రమాదముంది. 

(కార్మిక వాహిని పత్రిక,1/2021)

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు