అపనమ్మకానికి గంతలు కట్టాలి
బురదగుంటలో దిగబడిపోయిన తన కారును చూసి నిట్టూర్చాడు రామ్.ఆక్సిలరేటర్ బలంగా నొక్కాడు. బురదలో కూరుకున్న కారు చక్రాలు గిర్రున తిరిగాయి. కాని అవి మరింత కూరుకు పోయాయి. ఇక లాభం లేదనుకుని కకారు ఆపు చేసి కిందకు దిగాడు రామ్.
సాయంకోసం చుట్టూ చూశాడు. దూరంగా ఓ రైతు కనపడ్డాడు.ఆ రైతు సాయం అడిగాడు.
పరిస్థితి చూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బయటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలం నుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు.
దాన్నిచూడగానే ఆ రామ్ నిరాశతో ఉసూరుమంటూ పక్కన కూర్చున్నాడు.
రైతు ఆ ముసలిఎద్దును కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ 'రాజూ', 'అంజీ', 'నందీ'ఏంట్రా ఆలోచిస్తున్నారు తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! ఆ ముసలి బక్క ఎద్దు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది,,,.
ఆ కారు పెద్దాయన ఆశ్చర్యంతో,
' ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటి, అన్ని ఎద్దులు ఉన్నట్టు అదిలించారు?...అయినా ఆ బక్క ముసలి ఎద్దు ఎలా ఈ కారును లాగింది"".? అని ఆశ్చర్యంగా అడిగాడు రామ్.
'ఈ ఎద్దు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా తన పక్కన చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది,,,చాలా సులభంగా లాగేసింది.. అంతే! పూర్తి నమ్మకం తో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!' అన్నాడా రైతు.
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ రామ్ ఆశ్చర్యపోతూ" భలే తెలివి నీది" అన్నాడు.
" అపనమ్మకానికి గంతలు కట్టాలి...దాని అపనమ్మకానికి నేను గంతలు కట్టాను...దాని బలాన్ని వెలికి తీసినాను... అంతే" అన్నాడు రైతు.
" నిజమే,! అపనమ్మకం మన బలానికి తూట్లు వేస్తూనే వుంటుంది.ముందు అపనమ్మకానికి గంతలు కట్టాలి.ఏమవుతుందో అనే భయాన్ని విడిచి పెట్టాలి" అనుకున్నాడు మనసులో రామ్.
Comments
Post a Comment