మందపల్లి శ్రీనివాసులు
మందపల్లి శ్రీనివాసులు నంబులపూలికుంట మండలం లోని పెడబల్లి గ్రామంలో 1.7.1963న
రామప్ప శివమ్మ దంపతులకు జన్మించారు.
ప్రాథమిక విద్యాభ్యాసం పెడబల్లి పాఠశాల లో ఉన్నత విద్యాభ్యాసం నంబులపూలికుంట లో ఇంటర్ కదిరి బాలుర జూనియర్ కళాశాల లో తర్వాత బీకాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. కదిరి లో ఉన్నప్పుడు అక్క సిద్దేశ్వరి గారింట్లో ఉండి చదువు కున్నారు.ఆమె ఆశీస్సులతోనే శ్రీనివాసులు జీవితం ముందుకు సాగింది.అన్న పెరుమాళ్లు అన్ని విధాల సహాయాన్ని అందించారు.
డిగ్రీ పూర్తయ్యాక సర్వీస్ ఫార్మా కంపెనీలో 500 రూపాయల నెలసరి వేతనానికి మెడికల్ సేల్స్ మెన్ గా చేరారు 1986 లో.
మునిరామయ్య, సరో జమ్మ దంపతుల కూతురు మంజులను 7.2.1988 లో వివాహం చేసుకున్నారు.వారికి అనూష, ప్రణీత్ లు
జన్మించారు.
20.1.89న జన్మించిన అనూష బీటెక్ ఎంబీఏ పూర్తి చేసి వివాహం చేసుకొని బెంగుళూరులో స్థిరపడినారు. 5.5.90 న జన్మించిన ప్రణీత్ ఐటిఐ డిప్లమా పూర్తి చేసుకొని హిందూపురంలో స్థిరపడ్డారు.
1990 లో ఉదయం ఏజెన్సీ ని నిర్వహించే వారు. ఆసమయంలో మిత్రుడు నరేంద్రనాథ్ సలహా మేరకు కొత్తగా కదిరికి వచ్చిన డెవలప్మెంట్ ఆఫీసర్ పిళ్లా విజయ కుమారస్వామి రెడ్డి దగ్గర 1992 మేలో ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నారు. తక్కువ వేతనంతో జీవితం సాగిస్తున్న సందర్భంలో ఎల్ఐసి ఏజెన్సీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో సహాయ పడిందని, యల్.ఐ.సి. ఏజెన్సీ లేకపోయుంటే చాలా ఇబ్బందులు గురయ్యేవాడినని శ్రీనివాసులు పలుమార్లు చెప్పేవారు. డెవలప్మెంట్ ఆఫీసర్ కుమారస్వామి కూడా ఎల్ఐసి వ్యాపారం చేయడంలో చాలా సహాయం చేశారని ఆయన అన్నారు. ఎల్ఐసి వ్యాపారం చేయడం ద్వారా అనేక బహుమతులు పొందారు.కడప, తిరుపతి మొదలైన ప్రదేశాలను సందర్శించారు. డెవలప్మెంట్ ఆఫీసర్ కుమార స్వామి రెడ్డి తన స్వంత ఖర్చులతో
అనేకచోట్లకు ముఖ్యంగా తిమ్మమ్మ మర్రిమాను, కదిరి కొండ, హార్సిలీహిల్స్ మొదలైన ప్రదేశాలలో ఏజంట్లందరినీ తీసుకెళ్లి సమావేశాలు నిర్వహించేవారు. వాటన్నింటికీ హాజరై ఎల్ఐసి కి సంబంధించిన విజ్ఞానాన్ని పొందారు.2015లో బ్రాంచి మేనేజర్ క్లబ్ మెంబర్ కు అర్హత
సాధించారు.
ఒకవైపు ప్రగతికి రథచక్రాలు గా నిలిచిన
ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగ బాధ్యత లతో సతమత మవుతూనే ప్రజలకు ఆర్థిక భద్రత నివ్వడానికి, అందరితో అనుబంధాలను పెంచుకుంటూ బీమా సంబంధ ఆర్థిక సలహాల నిస్తూ ముందుకు సాగు తున్నారు.
Comments
Post a Comment