నేను మీ LIC పాలసీని.


నేను రోల్ ఐ సి పాలసీ ని.
 ఈ ప్రపంచంలో మనిద్దరి పనులు ఒకటే.

  మీ కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం కల్పించడం మీ పని.
 మీ ప్రియమైనవారు చదువుకోవడానికి, అనారోగ్యం వస్తే మందులకు ఇంకా ఎన్నో ఎన్నెన్నో సమకూరుస్తున్నారు.
 నేనప్పుడు మీ బీరువాలో భద్రంగా పడుకో నుంటాను. 
మీ మీద నాకెంతో నమ్మక ముంది. 
 మీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో నన్నూ అలాగే చూసుకుంటారని.
మీ సంపాదనలోంచి నా కోసం కొంత ఖర్చు చేస్తారు కదూ.  
       కొన్ని సమయాల్లో  మీకనినిపించవచ్చు
 నేనెందుకు పనికిరానిదానని. కాని  ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు  నీ బాధ్యతను నేను తీసుకుంటానేమో.
 మీరు  ఎప్పుడో ఒకప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు, నేను లేచి వచ్చి పని చేస్తాను.
 మీ పనిని.  అప్పుడు మీ కుటుంబానికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం, విద్య వైద్యం  ఇలా ఎన్నో ఎన్నెన్నో వారి అవసరాలను తీరుస్తాను.
 మీరిప్పుడు చేస్తున్నట్లే విరామమెరుగని మీ పరిశ్రమ పూర్తయినప్పుడు, నే నప్పుడు మీకు చేదుడువాదోడునవుతాను. 
 మీ చేతులుగా మారి మీ కనుపాపనై మీవారినంరిని చూసుకుంటాను.
 నన్నప్పుడప్పుడూ భారంగాతలపోస్తావేమో
ఒకటి మాత్రం గుర్తుంచుకో సుమా నేను మీ కన్నా మీ ప్రియమైనవారిని అక్కున చేర్చుకుని  తోడూ నీడ గా నిలుస్తానని.

 కంతులుకట్టడం మీ వంతు 
       మీ కుటుంబానికి    
  ధీమానివ్వడం నా వంతు.

   మీ విధేయుడు
 మీ ఎల్ ఐ సి పాలసీ.



Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality