ప్రగతి సాధనకు పది సూత్రాలు

 
  photo: pinterest
“సాకులు చెప్పి, వాయిదాలు, వేసి, తర్కాలు చేసి ఎవ్వరు విజయం సాధించలేదు”

బీమా ఏజన్సీ ఒక అద్భుతమయిన వృత్తి మనిషిలోని శక్తి సామర్థ్యాలకు పదును పెట్టి, మనిషి లోపల దాగిన అసలు సిసలైన వ్యాపారనైపుణ్యాన్ని వెలికితీసే వృత్తి.
 అత్యంత కష్టతరమైన వృత్తి కూడా ఇదే. పట్టు దొరికిన తరువాత అమిత సులభమైన వృత్తి కూడ అదే. అయితే విజయాన్ని సాధించాలన్నా, ఏజంటుగా ఒక స్థాయికి ఎదగాలంటే, పట్టుదల, కృషి మాత్రమే చాలదు. మానవసంబంధాలను మెరుగు పరుచుకోవాలి.
              pc: pinterest
మనం సంఘంలో జీవిస్తున్నాం. ఈ సంఘంలో రకరకాల  మనస్తత్వాలు కలిగిన వారున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో విషయానికి ప్రాముఖ్యత యిస్తుంటారు. బీమా ఏజంటు అన్ని రకాలైన మనుషులతో, అన్ని రంగాలలో వున్ననారితో మంచి సంబంధాలు కలిగి వుండాలి.ఏఅంశంలో ఆసక్తి వుంటుందో ఆ విషయాన్ని గురించి
చర్చించి వారితో మాట్లాడే అవకాశాన్ని
పెంచుకోవాలి. అప్పుడే  బీమా అమ్మకం సులభమవుతుంది.
         బీమా ఏజన్సీనే ప్రధాన వృత్తిగా స్వీకరించిన ఏజంటు కొన్ని రకాలయిన పద్దతులను తప్పనిసరిగా పాటించాల్సి వుంది. అవేమిటంటే

1)  ధరించే దుస్తులు
2) పెదాలపై చెరగని చిరునవ్వు
3) కుతూహలం కనపర్చడం  
4) ఎదుటివ్యక్తి చెప్పే విషయాలపై ఆసక్తి చూపించడం
5)శ్రద్ధగా వినటం,
6) చక్కగా మాట్లాడగలగటం.
7) ప్రశంసించడం
8) పరిస్థితిని అవగాహన చేసుకోవటం, అతని అవసరాలు గ్రహించటం
9) ఇన్సూరెన్స్ పాలసీల గురించి పూర్తిగా తెలిసి వుండటం 
10)ధర్మ ప్రవృత్తిని కలిగివుండటం.

పై విషయాల గురించి మరికొంత పరిశీలిద్దాం

1) మనం ధరించేదుస్తులు పరిశుభ్రంగా వుండాలి. అట్టహాసమయిన రంగులు, కల్లు మిరుమిట్లు గొలిపే జిగేలుమనేటువంటి దుస్తులు ధరించకూడదు మన హుందాతనాన్ని పెంచేటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పరిశుభ్రమయిన, చక్కటి దుస్తులు మన ఆత్మ  స్థైర్యాన్ని పెంచుతాయి. దుస్తులతో మనగురించి ఎదుటివాళ్ళు ఒక అభిప్రాయానికి వస్తారు కాబట్టి వీటికి అత్యంత ప్రాధాన్యత యివ్వాలి.

2) చిరునవ్వు అనేది ప్రతి వ్యాపారస్తుడికి అత్యంత అవపరమయినది. అది పెదవులపై ఒక చిన్న గీత మాత్రమేగాని జీవితంలో అనేక సమస్యల్ని సరిచేస్తుంది. నవ్వు ఒక అంటు వ్యాధిలాంటిది. ఒకరి ముఖంలో దరహాసం పది మంది మూడు మారుస్తుంది. చాలామంది చికాకులను తొలగించి మనిషి పాజిటివ్ యాటిట్యూడ్ ని డెవలప్ చేస్తుంది. పరిస్థితులమ సానుకూల పరిచి, మార్గాన్ని సుగమం చేస్తుంది.

3)కుతూహలం, జిజ్ఞాస బీమా ఏజంటుకు సరికొత్త కళను సంతరింపజేస్తుంది. ఎదుటి వ్యక్తి చెప్పే విషయాల గురించి తెలుసుకుందాం అని కుతూహలం చూపిస్తే అతను ఎక్కువగా మాట్లాడతాడు. అప్పుడే పరిచయం మరింత గట్టిపడుతుంది. పరిచయస్తుడి స్థాయినుంచి మిత్రుడి స్థాయికి ఎదుగుతారు. మన పని సులభమవుతుంది.

4)ఎదుటివ్యక్తికి, యిష్టమయిన అంశాలపై ఆసక్తిని కనపర్చాలి.ఉదాహరణకు మనం వెల్లినప్పుడు ఆ వ్యక్తి టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి. మనకు క్రికెట్ పైన ఆసక్తిలేకపోయినా, అత్యంత ఆసక్తి కరంగా మ్యాచ్ చూడటం, ఆ వ్యక్తి తో పాటు ఫాలో కావటం అవసరం ఉంటుంది. అప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడటానికి యిష్టం కనపరుస్తాడు.

5) మాట్లాడటం కన్నా, వినగలిగే నేర్పును కలిగి వుండటం అత్యంత అవసరం. ఎదుటి వ్యక్తి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మంచిది. అప్పుడు మనం అతని కుటుంబ వ్యవహారాల్ని, అతని సాంఘిక జీవితాన్ని అతని కొనుగోలు శక్తినీ, అతని ప్రాధాన్యతలు, అతని అవసరాలను సరిగ్గా అంచనా వెయ్యవచ్చు. అతని గురించి ఒక అవగాహనకు రావచ్చు.

6)చక్కగా మాట్లాడటం ఒక కళ.మాటలతో మన్ననలు పొందవచ్చు. మాటలతో యుద్ధాలను సృష్టించవచ్చు. యుద్ధాలను ఆపెయ్యవచ్చు. మనిషి కి అందుబాటులో వున్న అత్యున్నతమయిన శక్తి .. మాటలశక్తి.అది అణుశక్తి కన్నా ఎక్కువ విస్పోటనాలను సృష్టించగలదు.   లోకకల్యాణానికి కూడా  ఉపయోగపడగలదు.దుస్తులు, ముఖ కవలికలు మన బయట రూపాన్ని చూపిస్తే, మాటలు మన లోపలి స్వరూపాన్ని బహిర్గతం చేస్తాయి.
మనకున్న తెలివితేటలు,  మన చతురత,  మన నేర్పరితనం,మన మంచితనం యివన్నీ కూడా మాటల ద్వారానే అవతలి వ్యక్తికి తెలుస్తాయి.కనుక జీవిత బీమా ఏజెంటు చక్కగా మాట్లాడటం చాలా అవసరం.
7) ప్రశంసించడం చాలా ముఖ్యమైన విషయం.
ఇతరులను పొగడటం వల్ల చాలా పనులు సులభంగా జరుగుతాయి.పొగడ్త మనిషికి టానిక్ లాంటిది.తనను ఎవరైనా పొగిడితే ఎంత ఆనందం వేస్తుందో అంతే ఆనందం ఎదుటి వ్యక్తికి కూడా కలుగుతుంది. పొగడటమంటే ఎదుటి వ్యక్తిలో లేని సుగుణాల గురించి పొగడాలని కాదు. కనిపించినవి లేదా వ్యక్తిలో ఉన్న ప్రతిభ కావచ్చు లేదా వైఖరి కావచ్చు ఏదైనా సరే దాన్ని మొహమాటం లేకుండా మనస్పూర్తిగా పొగడాలి.

8.ప్రాస్పెక్టు దగ్గరకు వెళ్లినప్పుడు   పరిస్థితిని సరిగా అవగాహన చేసుకోవాలి. అక్కడి
పరిస్థితికి తగ్గట్లు ప్రవర్తించాలి. ఉదాహరణకు మనం ప్రాస్పెక్టు దగ్గరకు వెళ్ళినపుడు 
వాళ్ళ సన్నిహితులెవరినో హాస్పిటల్లో ఎడ్మిట్ చేశారనుకోండి.అప్పుడు మన ప్రాడక్టు గురించి మాట్లాడటం సరికాదు. 

అంతే గాక ప్రాస్పెక్టు అవసరాలను తెలుసుకోవాలి. నీడ్ బేస్డ్ సెల్లింగ్  పాలసీల అమ్మకంలో చాలా ముఖ్యమైంది.
జీవిత బీమాలో అనేక రకాల  పాలసీలు వున్నాయి. ప్రతి పాలపీలో ఒక ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు మధ్య మధ్య లో అవసరం వున్న ఒక వ్యాపారస్తుడు వున్నాడనుకుందాం. అతనికి మనీ బ్యాక్ పాలసీ   అమ్మొచ్చు అంతేగానీ ఎండో మెంటు పాలసీని ఇవ్వగూడదు. ప్రాస్పెక్టు  కొనుగోలు శక్తినీ,  అవసరాన్ని గుర్తించిన
తరువాతే పాలసీని మనం అమ్మాలి.

9. నాలెడ్జ్ ఈజ్ పవర్. విజ్ఞానం అత్యంత శక్తి వంతమైనది. పాలసీల గురించి పూర్తిగా తెలుసుకోకుండాఎదుటి వ్యక్తి వేసే ప్రశ్నలకు సరైన  సమాధానాలు ఇవ్వలేకపోతాం. అంతే కాదు తప్పుడు సమాచారాన్ని యిచ్చే అవకాశంవుంది. ఒకసారి తప్పుడు సమాచారాన్ని యిస్తే ఆ విషయం ప్రాస్పెక్టు తెలుసుకుంటే మన గుడ్విల్ పోతుంది. అతను మనల్ని యిక ఏ విషయంలోను నమ్మడు.   కొత్త పథకాలు వస్తుంటాయి. వాటి గురించి బాగా అర్థం చేసుకొన్న తరువాతే మార్కెట్లోకి అడుగు పెట్టాలి. 


Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు