జీవిత బీమా
జీవిత బీమా అనగానేమి?
మనిషి తన జీవితం ముగించినా లేదా ఒక మనిషి సహజంగా చనిపోయినా, లేదా తాత్కా లికంగా అంగవైకల్యాన్ని ప్రమాదవశాత్తు
పొందితే, ఆ వ్యక్తి కుటుంబానికి ఆదాయం ఆర్థికంగా నష్టం జరుగుతుంది.ఆర్ధిక పరమైన నష్టాన్ని పూరించేదే జీవిత బీమా.
జీవిత బీమా అనేది ఒక వ్యక్తి మరణం, అంగవైకల్యం, దుర్ఘటన, ఉద్యోగ విరమణ మొదలయినవంటి వాటికి ఆర్థికపరమైన సంరక్షణనిచ్చే సాధనమని అర్థం.
ఇది రిస్క్ మేనేజ్‌మెంట్ లో ఒక రూపం. సరళంగా చెప్పాలంటే, భవిష్యత్తులో జరిగే నష్టాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక సంస్థకు ఒకే మొత్తాన్ని చెల్లిస్తారు. దీనిని ప్రీమియం అంటారు.అనుకోని సంఘటనలు వల్ల దురదృష్టం జరిగినప్పుడు, ఆ పరిస్థితి నుండి బయట పడటానికి బీమా సంస్థ మీకు/ మీ కుటుంబానికి సహాయం చేస్తుంది.
జీవిత బీమా కుటుంబానికి,వ్యక్తికి రక్షణ
వర్షంలో తడిసి పోతున్నప్పుడు అయ్యో గొడుగు లేదే అనుకుంటాం. గొడుగు తెచ్చుకుంటే బాగుండేది కదా వర్షంలో తడిసే వాళ్ళం కాదు కదా అని అనుకుంటాం.అలాగే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు కొంత డబ్బు ముందుగా దాచిపెట్టుకుని ఉంటే మనకు ఉపయోగపడేది కదా అని అనుకుంటాం. అలాగే మన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు జీవిత బీమా మనకు ఛత్రం లాగా, ఒక పొదుపు లాగా ఉపయోగపడు తుంది.
"తను లేకపోతే తన కుటుంబానికి దిక్కెవరు" అని ఒక వ్యక్తి ఆలోచించాడంటే అతనికి కుటుంబం పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు. సాధారణంగా అలాంటి వ్యక్తి తను ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు జీవిత బీమా పథకాన్ని తీసుకుంటాడు.
మామిడి చెట్లు నాటి కొంతకాలం సాగు చేసిన తర్వాత పెద్దవై ఏళ్ల తరబడి ఫలాన్నిస్తాయి .అలాగే జీవిత బీమా పాలసీ లో కూడా నెమ్మదినెమ్మదిగా కొట్టిన సొమ్ము కొంతకాలం తర్వాత మనకు పెద్ద మొత్తంగా అందుతుంది. అందువల్ల ఇది బ్యాంకులో డబ్బులు దాచుకున్న దానితోను, బంగారం కొనడంతో నూ సరితూగదు. ఇది వీటన్నిటికన్నా మించింది. భీమా ఇచ్చిన ధీమా ఇంకేది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రైతులకు పేద ప్రజలకు కార్మికులకు ఉచితంగా రెండు లక్షలు మొదలుకొని ఐదు లక్షల వరకు ఇస్తోంది.
జీవితంలో మనం మెదడుతో కాక మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం.తెలుసుకోవలసిన విషయం.
1. జీవిత బీమా దీర్ఘకాలికమైన పొదుపును అలవాటు
చేస్తుంది.
2 బీమా చేసిన రోజు నుండి ఎంత మొత్తానికి బీమా చేశారో
అంత మొత్తానికి రక్షణ ఉంటుంది.
3. ఎల్ ఐ సి ఆఫ్ ఇండియా ద్వారా జూరీ చేయబడే ప్రతి
పాలసీకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది.
4. పెరుగుతున్న బోనస్ రేట్ల కారణంగా లాభాలతో
కూడిన పథకాలలో కట్టవలసిన ప్రీమియము కన్నా వచ్చే
బోనస్ ఎంతో ఎక్కువ.
5. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 88 క్రింద బీమా పాలసీ కి కట్టే
ప్రీమియములపై రాయితీ ఉంటుంది. ఇతర పెట్టుబడులపై
లభించే వడ్డీపై పన్ను విధింపబడుతూ ఉండగా బీమా
పాలసీలపై లభించే బోనస్ పై ఆదాయపు పన్ను లేదు.
6. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరి నుండి అన్ని వయసుల వారికి
అన్ని వర్గాల వారికి, వారి వారి అవసరాలకు సరిపోయే
పథకాలెన్నోవున్నాయి.
7. ప్రీమియం రూపంలో చెల్లించబడే మొత్తాలు దేశాభివృద్ధి
కార్యక్రమాలకు పెట్టుబడులుగా ఉపయోగించబడతాయి.
జీవిత బీమాను ఎందుకు చేయాలి?
మనమందరం ఈ క్రింది అపాయాలను ఎదుర్కొంటాం.
1. తొందరగా మరణించడం/ప్రమాదాలకు గురవడం.
2. ఎక్కువ కాలం జీవించడం/అనారోగ్యాలలతో ముక్కుతూ మూల్గుతూ జీవించడం
అందువల్ల జీవిత బీమా అవసరం. మీరు ఆకస్మాత్తుగా మరణిస్తే మీ కుటుంబానికి కొద్దోగొప్పో ఆర్ధికపరమైన సహాయం పొందడానికి, మీ పిల్లల విద్య మరియు ఇతర అవసరాలకు డబ్బు ఖర్చుచేయడానికి, వృద్దాప్యంలో జీవితం ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగడానికి జీవితబీమా ఎంతో అవసరం.

Comments
Post a Comment