విజయాన్ని సాధించడానికి కొన్ని పద్దతులు



      విజయాన్ని సాధించడానికి కొన్ని పద్దతులు పాటించాలి.
        ముఖ్యంగా ఆదాయానికి సంబంధించి ఒక హేతుబద్ధమైన లక్ష్యం ఏర్పరచుకోవాలి.ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలి.
        ప్రతిరోజు చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు రూపొందించుకొంటూ ఉండాలి.
వాటిని పూర్తి చేస్తూ ఉండాలి.
      ఈ రోజు పనిని ఈరోజే పూర్తి చేయాలి. 
      కష్టమైన పనిని మొట్టమొదట పూర్తి చేయాలి.



      కలుసుకోబోయే వ్యక్తుల గురించి తెలుసుకొని వారి పేర్లు ఒక చిన్న పుస్తకం లో రాసి పెట్టుకోవాలి.వారి చరవాణి నంబరును తప్పకుండా రాసి పెట్టుకోవాలి.
       వ్యక్తులను ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు
కలిసి వారి గురించి  సాద్యమైనంత సమాచారం ఎక్కువగా తెలుసుకోవాలి.
     అనుకున్న సమయానికి వారిని కలుసుకోనేలా బయల్దేరాలి.
    పాలసీలు చేయించబోయే వ్యక్తుల దగ్గర సాధ్యమైనంత ఎక్కువగా మీరు చెప్పదలచు కొన్న విషయాన్ని సమర్ధవంతంగా, ఆకట్టుకొనేలా చెప్పాలి.
   ‌ అవసరమైన రికార్డులన్నీ ఉంచుకోవాలి.
   ‌ మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోవడానికి శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావాలి.మీకెంత 
తెలిసుంటే అంత బాగా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోగలరు.
       మనస్సుకి ఉల్లాసాన్నిచ్చేట్లు కొంత
సమయాన్ని గడుపుతూ ఉండండి.

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు