విజయం పొందాలంటే.....

     Nike,Greek goddess of victory 
             pc Wikipedia
క్రమశిక్షణ,సహనం,పట్టుదల - విజయాన్ని సాధించడానికి ఈ మూడు అత్యంత అవసరం.

వీటన్నిటికీ మించి కావలసింది
 
 లక్ష్య శుద్ది

మొదట ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. 

మీరు చిన్న బుడగలాంటి వారై ఉండవచ్చు. ఇంకొకరు శిఖరాగ్రమంత ఎత్తయిన కెరటమే కావచ్చు. అయినా అపరిమితమైన సముద్రమే ఆ రెండింటికీ ఆధారం అని మరిచి పోవద్దు.

ధైర్యశాలిగా ముందుకు నడవండి .

 ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో విజయాన్ని ఆశించ కుండా. ఎల్లప్పుడూ మీరు చేసే నిత్య కృషి మీ యొక్క దీర్ఘ కాలిక లక్ష్య సాధనలో భాగమని గుర్తించండి.

 ఉత్తమోత్తమమైన ఆదర్శాన్ని కలిగి ఉండాలి.


 స్థిరత్వం కలిగి ఉండాలి.

చరిత్రలో గొప్ప వ్యక్తులను పరికిస్తే; వారు తప్పుల నుండి, దుఃఖాల నుండి కొత్త పాఠాలను నేర్చుకొని గొప్పవారయ్యారని తేటతెల్లమౌతుంది.

అపజయమనే భయం తొలగితేనే విజయమనే నిజమైన సుఖసంతోషాలు కలుగుతాయి.

మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచన, పలుకు మాత్రమే ఈ లోకంలో ఉన్న కీడు అని గ్రహించండి 
మనిషిని బలహీనపరచే, మనిషికి భయాన్ని కలిగించే దానిని మాత్రమే చెడుగా, భావించి తిరస్కరించండి. 

మానసిక బల సంపన్నులు కండి. 

కలలు కనండి.కలల సాకారం కోసం, మీ కుటుంబం కోసం, మీ కోసం విజయ దీక్షా పరులై ముందుకి సాగండి.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality