కమ్యూనికేషన్ స్కిల్స్
"చక్కగా మాట్లాడడం" వ్యాపారాభివృద్ధికి సోపానం
జీవిత బీమా ఏజెంట్లు తమ "వ్యక్తిత్వం" ద్వారా ఇతరులను ప్రభావితుల్ని గావించి వ్యాపార సేకరణ, అభివృద్ధి సాధిస్తారు. ఇతరులను ప్రభావితం చేయడంలో తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి విజయం సాధిస్తారు. వాక్చాతుర్యం, చక్కగా మాట్లాడడమన్నది ఒక కళ. బాగా అధ్యయనం చేయాలి. అభ్యాసం చేయాలి. లాంచనప్రాయ ఉపన్యాసాలు, మాటలు, ప్రసంగాలు మాత్రమేగాక పలురకాల ఇతర ప్రక్రియలుకూడా మాట్లాడడం అనే ప్రక్రియగా పరిగణిస్తారు.
చక్కగా మాట్లాడడానికి ప్రతి ఏజెంటు ఈ క్రింది ఆరు సూత్రాలను పాటించాలి.
వీటి గూర్చి క్లుప్తంగా
మాటలో స్పష్టత వుండాలి:
చెప్పదలచిన విషయాన్ని క్లియర్ గా పారదర్శకంగా చెప్పాలి. సందేహాలకు, కన్ఫ్యూజన్ కు తావు లేకుండా వుండాలి
పదాల ఉచ్చారణ, పొందుపరచే విధానము, స్పష్టత చక్కగా వుంటూ, నిజాయితీగా వుండాలి. మనకు కావలసినవి మనకు స్పష్టముగా
తెలియకపోయినా, లేక తెల్పుటలో క్లారిటీలోపం, సందిగ్ధత వున్నా మనము మన భావాలను వ్యక్తీకరించలేము. మన ఆలోచనలను
మాటల రూపంలో మార్చేటప్పుడు మనమైండు క్లియర్ గా స్పటికంలాగా పాలిష్ పెట్టాలి. సరైన పదాలు, భాష, వ్యక్తీకరణ విధానము
ఎన్నుకోవాలి. మన వ్యక్తీకరించే భావం స్పష్టంగా వుండాలి.
సంసిద్ధంగా వుండాలి :
సాధ్యమైనంతవరకు మాట్లాడే ముందు మనము సంసిద్ధం అవ్వాలి. ప్రిపరేషన్ లేకుండా మాట్లాడిన మనము చెప్పదలచిన వాటిని స్పష్టంగా చెప్పలేము. మనము మాట్లాడానికి సరిగా ప్రిపేర్ కావాలంటే ఈ క్రింది విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి
1. ఎవరితో మాట్లాడదలచామో వారిని గూర్చి మంచి అవగాహన వుండాలి. ఎదుటివారి యిష్టాయిష్టాలు, అభిరుచులు వారు మన నుండి ఏమి ఆశిస్తారు, అనే యిత్యాది విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యము. మనం మాట్లాడదలచిన అంశముగూర్చి మంచి అవగాహన అవసరము. అలాగే ఎదుటివారి స్పందన, లక్ష్యం, తెలుసుకోవాలి
విజయవంతంగా మాట్లాడ్డానికి సరైన నోట్సు తయారు చేసుకోవాలి. మన కమ్యూనికేషన్ విజయము మనలక్ష్యాన్ని బట్టివుంటుంది ఎలా మాట్లాడాలి : మనం చెప్పే విషయాన్ని అత్యుత్తమ స్థాయిలో అందివ్వగలగాలి. మనం వాడే భాష ఎదుటివ్యక్తిని దృష్టిలో పెట్టుకొని సరైన పదజాలం ఎంచుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో మొదలు, మధ్య, చివరి భాగాలను గుర్తుంచుకొని మాట్లాడాలి. అవసరమైతే Power Point Presentation కంప్యూటర్ సహాయంతో వాడవచ్చు. ఉదా : రంగురంగుల బ్రోచర్లు మొదలుగునవి
ఎప్పుడు మాట్లాడాలి:
ఎప్పుడు మాట్లాడాలి అన్నది చాలా ముఖ్యము. కమ్యూనికేషన్ సమయం చాలా కీలకమైనది. సరైన సమయములో మన భావాలను వ్యక్తీకరించాలి. ఎదుటివ్యక్తి మన కమ్యూనికేషన్ స్వీకరించే పరిస్థితులలో మాట్లాడాలి. అతను సిద్దంగా లేనపుడు మనము మాట్లాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించలేము
ఎక్కడ: మనము కమ్యూనికేట్ చేయుటకు సరైన ప్రదేశము ఎంచుకోవాలి, మన ప్రోస్ పెక్ట్ ను రోడ్డుమీద లేక ఇతర ప్రదేశాలలో కల్సినపుడు ఇన్సూరెన్స్ గూర్చి కమ్యూనికేట్ చేయడం సరైన పద్ధతికాదు. సరైన ప్రదేశాన్ని ఎన్నుకోవడం, ఆప్రదేశాన్ని తగిన విధంగా తీర్చిదిద్దుకోవడం వగైరాలపై శ్రద్ధవహించాలి,
ఎందుకు: ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నామన్న విషయం చాలా ముఖ్యం. ఎదుటివ్యక్తి మనము చెప్పే విషయాలను ఎందుకు వినాలో తెలియచేయాలి. ఎదుటివ్యక్తి కాలము వృధా అనుకోని విధంగా కమ్యూనికేషన్ వుండాలి. ఇరుపక్షాలు కమ్యూనికేషన్ వలన లాభము వుందన్న భావనకలుగజే సేవిధంగా కమ్యూనికేట్ చేయాలి. ఎదుటి వారిలో ఏకాగ్రత ఆసక్తి కలిగించే విధంగా కమ్యూనికేషన్ వుండాలి.
సరళంగా మాట్లాడాలి: మనము మాట్లాడేటప్పుడు మన భాష, ప్రయోగం చాలా సింపుల్ గా డైరక్టుగా వుండాలి. మన పాండిత్యాన్ని
వ్యక్తీకరించడంకన్న ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే భాష ఎంచుకోవాలి. సరళంగా సులభంగా అర్ధమయ్యే భాష, పదజాలాన్ని వాడాలి. పదాలు
సంక్షిప్తాకషరాలను వాడడం మంచిదికాదు. పొందికైన మాటలు, వినపొంపుగా వుండాలి. క్లిష్టతరమైన సాంకేతిక పదాలను వీలైనంతవరకు
వాడడం మంచిదికాదు. మాటల బరువు భావుకత శ్రోతలకు అనువుగా వుండాలి. బీమాగురించి తెలియని వ్యక్తికి సాంకేతిక పదజాలంతో
కూడిన మాటలు అర్థం కాకపోవచ్చు. కాన మనము చెప్పదలచిన విషయాన్ని సాధ్యమైనంత సులభంగా, సరళంగా చెప్పాలి అభివర్ణిస్తూ మాట్లాడడం: మనం ఎదుటివ్యక్తులకు విషయాలను తెలియజేయునపుడు, వారిలో ఆసక్తిని కలుగచే సేవిధంగా వుండాలి. మన మాటలు వారిని మంత్రముగ్ధులను చేసి, లొంగిపోయేలా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మన్ననలు, మెప్పు పొందేవిధంగా చక్కని వర్ణనలతో, ఉపమానాలతో, హస్యచతురోక్తులతో విషయాన్ని చెప్పవలెను. అప్పుడే శ్రోతకు మనం మాట్లాడే విషయంపై ఆసక్తి కలుగును దీనికోసం ముందుగా ప్రిపేరుకావాలి. కొంత సాధన, అభ్యాసము చేయాలి. ఆసక్తికరమైన విషయాలు చొప్పించాలి. నాటకీయత, సృజనాత్మకత జోడిస్తే, మన మాటలు ఎదుటివ్యక్తిని కట్టిపడవేస్తాయి. ముఖ్యంగా నిజజీవిత సంఘటనలు, ఉదాహరణలు, సరైన వివరణలు
సహజసిద్ధంగా మాట్లాడాలి : మనం ఉద్వేగాలు. ఎమోషన్లకు లోనుగాకుండా సహజసిద్ధంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా వుంది. మనము మాట్లాడేటప్పుడు ఎదురయ్యే ప్రమాద సంకేతాలను గుర్తిస్తూ వీలయినంత సహజధోరణిలో మాట్లాడుతున్నంత ప్రీగా మాట్లాడాలి. రిజర్వేషన్ను, మొహమాటపడదం వగైరా పనికిరాదు, ఏహజత్వం లోపించినపుడు, మాటలు కృతకంగామారి, విచాసత్తంగా తయారవుతుంది. తీవ్ర కంఠస్వతమో లేక మంద్రస్థాయిలో పరిగా అర్ధంగాని రీతిలోనో మాట్లాడం మంచిది కాదు. మన మాటలకు పవైన నాదము, శృతి వుండాలి. మన వాచకం, స్పష్టంగా మృదుమధురంగా వినసొంపుగా, నాచురల్గా వుండాలి భావావేశం కొంతజోడించి
నపుడు సహజత్వం వుంటుంది. సరైన మోతాదులో ఉద్వేగాలు, భావావేశం, మనమాటలకు జీవం పోస్తుంది సంక్షిప్తంగా మాట్లాడాలి: మనం చెప్పదలచుకున్న విషయం మరీ సుదీర్ఘంగా కాకుండా సంక్షిప్తంగా వుండాలి. భావవ్యక్తీకరణ ముఖ్యంగాని, భాషా పాండిత్యం కాదు. అన్నట్లు సంక్షిప్తంగా ఉన్న మాటలు అందాన్నిస్తాయి. కాలము అందరికి విలువైనది. ముఖ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివ్యక్తి కాలాన్ని వృధాకానివ్యకంది. మనం చెప్పదలచిన విషయం, సమగ్రంగా, సంక్లిప్తంగా వుండేటట్లు చూసుకోవాలి, ఉకదంపుడు మాటలు విషయాన్ని ప్రక్క త్రోవ పట్టిస్తుంది. నిరాసక్తిని కల్గిస్తుంది. మనం చెప్పే విషయాన్ని ఈక్రిందివధంగా విభజించి శ్రోతను, కాలాన్ని బట్టి మాట్లాడాలి తప్పనిసరి విషయాలు చెప్పి తీరాలి. తర్వాత చెప్పవలసినవి. ఆపై సమయం అనుకూలిస్తే "వీలైతే చెప్పవలసినవి చెప్పాలి కావున మాట్లాడే విషయం కీలకాంశాలు, చెప్పవలసినవి, కాలాన్ని బట్టి వివరించదగిన విధంగా విభజించుకొని మాట్లాడాలి. ప్రశ్నలు అడగండి- వివరణ కోరండి: మనం కమ్యూనికేషన్ ఫలితాన్ని తెలుసుకోవలసినపుడు మనము ఎదుటి వ్యక్తిని ప్రశ్నించాలి. అతని వివరణ కోరినపుడు మన భావాలను సరిగా అందజేసామా అన్న విషయము తెలుసుకొంటాము. హెర్డింగ్ ముఖ్యము మనము మాట్లాడేటప్పుడు డైరక్టుగా సబ్జెక్టులోనికి వెళ్లడం సరైనది కాదు. మనము చెప్పదలచిన విషయం ముఖ్యోర్తేశ్యాని అంశాలను ముందుగా తెల్చి, శ్రోత మైండును మన సబ్జెక్టువైపు ట్యూను చేసుకొని, మాట్లాడడం మంచి ఫలితాన్నిస్తుంది.
V. Siva Prasad.
Comments
Post a Comment