కైజెన్ విధానం
కైజెన్ జపాన్ పదం.
దీని గురించి విన్నారా?
సరిగ్గా అర్ధం చేసుకుంటే కైజెన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మిమ్ములను ఆరోగ్య వంతులుగా మారు స్తుంది. సంపన్నులను చేస్తుంది. మీకున్న చెడు అలవాట్లు అన్నీ కైజెన్ విధానంలో వదిలేయ వచ్చు. ఆరోగ్య కరమైన అలవాట్లు అలవర్చుకోవచ్చు. ఇంట్లో రాగిరేకులు కట్టుకుంటే సంపదవస్తుంది. చైనా వాస్తు మిమ్ములను ఎక్కుడికో తీసుకు వెళుతుంది అనే ప్రచారానికి లోటు లేదు. కైజెన్ అంటే అదో
రకం జపాన్ వాస్తు అనుకోకండి. ఇదేమీ మనకు తెలియంది కాదు. తెలిసిందే. కానీ మనం ఆచరించడం లేదు.
ఆచరిస్తున్న జపాన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
దేశాల సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందేందుకు సంపదకు కైజైన్ విధానం మనకు ఎంతో ఉప యోగపడుతుంది.
వేయి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్కో, నీటి బిందువుతోనే సముద్రం అవుతుంది.ఇవి మనకు తెలిసిన మాటలే. కెజైన్ విధానం ఇదే. ఎంత ధైర్యంగా కనిపించే వ్యక్తుల్లో అయినా భయం ఉంటుంది. ఏ కొత్త పని చేయాలన్నా మనల్ని భయం వెంటాడుతుంది.ఆదిమానవులు ఆడవుల్లో జీవించే కాలంలో చెట్టు పక్కన ఏదైనా అలికిడి విన్నా భయపడే వారు. అలా భయపడి అప్రమత్తంగా ఉంటేనే బతికి ఉంటారు. లేకపోతే ఏ పులికో మరే జంతువుకో బలవుతారు. ఆ భయం అనేది మనిషిని ఇప్పటికీ అలానే వెంటాడతూనే ఉంది. ఏదైనా కొత్త పనిచేయా లన్నా, ఒక భాషనేర్చుకోవా లన్నా, ఒక పరిశ్రమ స్థాపించా లన్నా మనమెదడు ముందుగా మనకు భయాన్ని పంపిస్తుంది. ఆది !నీ వల్ల కాదు, చేస్తే ఏమవుతుందో అనే సంకేతాలను ఆ మెదడు పంపుతుంది. మార్పును వ్యతిరేకిస్తూ మెదడు
భయపడమని చెబుతుంది.
జెన్ ఇక్కడే తన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనికే భయపడవద్దు, సాహసమే జీవితం అంటూ ఎన్ని మాట లైనా చెప్పవచ్చు. కానీ మెదడు మాత్రం భయపడమనే సంకేతాలు పంపుతుంది. కైజెన్ విధానంలో ఈ సమస్యను
ఎలా అధిగమిస్తారు అంటే...
ఒక పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకోవడమే కైజెన్ విధానం. ఉదాహరణకు మీరు బరువు పెరిగిపోతున్నారు. ఉదయమే లేచి వాకింగ్ చేయాలని, వ్యాయామంచేయాలి. యోగా చేయాలి అని చుట్టూ ఉన్న వారు సలహాలు ఇస్తారు. కానీ మీకు ఉదయం లేచే అలవాటే ఉండదు. కైజెన్ విధానం ఏమంటుందంటే రోజుకు గంట సేపు వాకింగ్ చేయడం మీ లక్ష్యం ఐతే, మొదటి
రోజు గంట సేపు వాకింగ్ వద్దు. అలా చేస్తే నాలుగైదు రోజుల తరువాత ఆసక్తి తగ్గిపోతుంది. కైజెన్ విధా నంలో, మొదటి రోజు ఒక్క నిమిషమే వాకింగ్ చేయండి పరవాలేదు. ఓ వారంతరువాత రెండు నిమిషాలు ఇలా పెంచుకుంటూ పోతే క్రమంగా వాకింగ్అంటే మీలో ఉండే వ్యతిరేకత పోతుంది. క్రమంగా
వాకింగ్ కు అలవాటు పడతారు. కొత్త పనిలో కొత్త
ఉత్సాహం లభిస్తుంది. కొద్ది రోజుల తరువాత గంట
సేపు ఉత్సాహంగా నడవగలరు. గంట నడకను ఏళ్లతరబడి వాయిదాలు వేస్తూ పోవడం కన్నా ఒక నిమిషంతో నడకకు శ్రీకారం చుట్టడం మేలు.పుస్తకాలు చదవడానికి కూడా ఈ పద్దతే అమలు చేస్తే ఫలితం ఉంటుంది.
ఆర్థిక వ్యవహారాలకు ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆమీ ఖర్చులు మీ చేయి దాటి పోతున్నాయి. జీతం |రాగానే ఏమవుతున్నాయో మీకే అర్ధం కాని పరిస్థితి.వృధా ఖర్చు అవుతోందని మీకు తెలుసు కానీ ఆ ఖర్చును ఆపలేక పోతున్నారు. ఒకేసారి ఖర్చు ఆపాలని అనుకుంటున్నా చేయలేకపోతుంటే కైజన్ విధానం అమలుచేయండి.
షాపింగ్ కు వెళ్లినప్పుడు మొదటి సారి మీరు కొనాలనుకున్న వాటి కన్నా ఒక్క వస్తువును తగ్గించండి. దీనిని ఒక అలవాటుగా మార్చుకుంటే క్రమంగా మీకు అవసరమైన వస్తువులు మాత్రమే కొంటారు. పెద్ద పెద్ద షాపింగ్మాల్కు వెళ్లినప్పుడు మనకు అవసరం అయిన వాటికన్నా ఎక్కువ కొంటున్నారు. కనిపించిన వాటినల్లా కొంటు
న్నారు. అలా కాకుండా జాబితా రాసుకుని దానికే పరిమితమై ఒక్క వస్తువును తగ్గించండి. వింతగా అనిపించ వచ్చు కానీ కైజెన్ విధానం మద్యం తాగే అలవాటును మాన్పించడానికి, సిగరెట్ తాగే అలవాటు మాన్పించడానికి సైతం ఉపయోగిస్తున్నారు. సిగరెట్లు తాగే అలవాటు మానలేకపోతే తొలుత ఒక్క సిగరెట్ తగ్గిస్తూ పోతేక్రమంగా పూర్తిగా మానేస్తారు. కోక్ ఎక్కువగా తాగే అలవాటున్న వారు తొలుత ఒక్క సిప్ తగ్గించి, క్రమంగాకోక్ కు దూరం అయ్యారు.ఇదే విధానం ద్వారా ఖర్పు తగ్గించుకోవడంతో పాటుపొదుపును అలవాటు చేసుకోవచ్చు.
పొదుపు ఆంటే మొదటి నెల నుంచే వేల రూపాయల్లో ఉండాలని లేదు. ఒక్క రూపాయితో పొదుపు అలవాటు చేసుకోవచ్చు. ఇదే విధంగా పొదుపును ఇన్వెస్ట్ చేయడం సైతం. చాలా మంది పొదుపు చేసినా ఎక్కడ ఇన్వెస్ట్
చేయాలో తెలియక భయపడు తుంటారు. స్టాక్ మార్కెట్అన్నా మ్యూచువల్ ఫండ్స్ అన్నా మొదట్లో భయం ఉండవచ్చు. కైజైన్ విధానంలో ఒక్క వెయ్యి రూపాయలతో మ్యూచువల్ ఫండ్లోకి అడుగు పెట్టిండి.
కొత్త భాష నేర్చుకోవాలి అంటే కైజన్ విధానంలో వారానికి ఒక్క పదం నేర్చుకోండి అని చెబుతారు. ఒక కొత్తభాష నేర్చుకోవాలని తరబడి వాయిదాలు వేస్తున్నవారు ఎందరో ఉంటారు. వారానికి ఒక పదం అంటే ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. దాని వల్ల భాషపై భయం
పోతుంది. క్రమంగా బాష వంటపడుతుంది.
డబ్బు విషయంలో సైతం ఇంతే. ఆదాయం, పొదుపు, ఇన్వెస్ట్మెంట్ అంటే తొలుత మన వల్లఅవుతుందా? అని పించవచ్చు. కానీ చిన్న చిన్నభాగాలుగా చేసుకుంటే ఎంత పెద్ద పనైనా సాధ్యమే.
చేసే ఉద్యోగంతో పాటు అదనపు సంపాదన
ఉండాలి అని కోరుకుంటే ఒకేసారి పెద్ద మొత్తంపై
ఆశలు వద్దు. అదనంగా పని చేయడం ద్వారా
కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావచ్చు. మొదలంటూ కావాలి.
రెండవ ప్రపంచ యుద్ధంలో నిండా మునిగిపోయిన జపాన్ తిరిగికోలుకున్నది కైజెన్ విధానం ద్వారానే. జపాపై అణుబాంబులు వేసిన తరువాత దేశం దారుణంగా దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.తిరిగి కోలుకుంటామా? అనే సందేహం నుంచి వచ్చిన పరిష్కారమే కైజైన్ విధానం. ఈ విధానాన్ని నమ్ముకున్న జపాన్ తిరిగి కోలుకోవడమే కాదు ప్రపంచం ముందు
తలెత్తుకుని నిలబడింది. ఒక్కో నీటి బొట్టు సముద్రంగా మారినట్టే, ఒక్కో రూపాయి ఒక చోట చేరితే కైజెన్ విధానం మిమ్ములను కోటీశ్వరులను చేస్తుంది.
Comments
Post a Comment