investment in fund

    pc enaadu

దీర్ఘకాల లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్ మేలు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్  ఆప్ లాంటివి) ద్వారా  డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.
Q. నమస్తే సర్, నేను రూ. 15,00,000 వరకు రుణం తెస్కోవలని అనుకుంటున్నాను. అయితే,  ఏమైనా పధకం ద్వారా తీసుకుంటే మంచిదా? లేక వ్యక్తి గత రుణం తీసుకోవాలా(sbi, lic, చిట్ ఫండ్ లాంటివి), నా జీతం 35,000. ఇంకా 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. దయచేసి నాకు సూచించగలరు. 
A. వ్యక్తిగత రుణం లో వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా, 11 శాతం నుంచి 18 శాతం వరకు ఉండవచ్చు . అత్యవసరం అయితే తప్ప వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డు రుణం తీసుకుపోవడం మంచిది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉండి, ఎక్కువ మొత్తంలో రుణం అవసరం అనుకుంటే తిరిగి చెల్లించే వెసులుబాటు, స్వల్పకాలం నిమిత్తం రుణం తీసుకోవాలనుకుంటే బంగారు రుణం తీసుకోవడం మేలు. మంచి క్రెడిట్ స్కోరు కలిగి, స్థిరమైన ఆదాయం ఉండి, రుణ చెల్లించే కాలపరిమితి ఎక్కువ కావాలనుకుంటే వ్యక్తిగత రుణాలను తీసుకోవడం మంచిది.  మీ వద్ద ఫిక్సిడ్ డిపాజిట్, బీమా పాలసీ, పీపీఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబడులు ఉన్నట్టయితే వాటి పై రుణం తీసుకోవచ్చు. వడ్డీ కాస్త తక్కువగా ఉంటుంది. వీలయితే రుణాల బదులుగా స్వల్ప కాలం పాటు పొదుపు చేయడం మేలు.

ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టి మదుపరులకు మంచి లాభాలు ఆర్జించాలనే వ్యూహంతో వచ్చిన పథకం ‘హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అలకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’. దేశంలోని అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ దీన్ని తీసుకువచ్చింది. ఈ ఓపెన్‌ ఎండెడ్‌ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఈ నెల 30తో ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000.
ఈ ఫండ్‌ సాధారణ పరిస్థితుల్లో దేశీయ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతుంది. ఇందులో 40 నుంచి 80 శాతం సొమ్ము ఈక్విటీ పథకాలకు కేటాయిస్తుంది. 10% నుంచి 50% వరకూ రుణ పథకాలకు కేటాయించవచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో 30% వరకూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మార్కెట్‌ పరిస్థితుల ప్రకారం ఏదైనా ఒక విభాగంలో అధిక లాభాలు లభించే అవకాశం ఉందని ఫండ్‌ మేనేజర్‌ విశ్వసిస్తే, ఆ విభాగానికి కేటాయింపు పెంచవచ్చు.
‘హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ అలకేటర్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ పనితీరును నిఫ్టీ 50 హైబ్రీడ్‌ కాంపోజిట్‌ డెట్‌ 65: 35 ఇండెక్స్‌ (టీఆర్‌ఐ) తో పోల్చి చూస్తారు. ఈ ఫండ్‌కు అమిత్‌ గణత్రా (ఈక్విటీ), అనిల్‌ బంబోలి (డెట్‌), కిషన్‌ కుమార్‌ డాగా (గోల్డ్‌ ఈటీఎఫ్‌ స్కీమ్స్‌) ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం దాదాపు 20 వరకూ అసెట్‌ అలకేటర్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ రిస్కు, ఒక మాదిరి ప్రతిఫలం ఇటువంటి పథకాలకు ఉన్న ప్రత్యేకత. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా ఈ జాబితాలో చేరుతోంది. సాధారణంగా అసెట్‌ అలకేటర్‌ ఫండ్లలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి ఉంటుంది. అప్పుడు కొంత లాభాలు కనిపిస్తాయి. అందుకు సిద్ధమయ్యే వారు ఇటువంటి ఫండ్లను పరిశీలించవచ్చు.


(Enaadu,23.4.2021)

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality