ఏజంటు మిత్రులకు సూచనలు
📢 ఎల్ ఐ సి ఏజెంట్స్ గా నూతన వ్యాపార సేకరణ లో విశేషంగా రాణిస్తున్న కొంతమంది ఏజెంట్ మిత్రులకు అద్భుతమైన సూచనలు:
📢 కస్టమర్ కు సంబందించిన అన్ని విషయాలు(ఆర్ధిక,సమాజిక,మానసిక అంశాలు) ముందే ఆకలింపు చేసుకొని వారి అవసరాలకు సరిపోయే పాలసీని ఎంచుకొని, బాగా ప్రిపేర్ అయ్యి వారికి చక్కగా అర్ధమయ్యేలా వారి భాషలో ప్లాన్ ప్రెసెంటేషన్ చేయాలి(good preparation ).
📢 కస్టమర్స్ ను మొహమాటం లేక బలవంతం పెట్టకుండా వారి భవిష్యత్ అవసరాలను(పిల్లల విద్యా లేద వివాహ ఖర్చులు లేదా పెన్షన్ అవసరాలు మొ..), మీరు అమ్మబోయే పాలసీ ఏ విధంగా తీరుస్తుందో వారికి చక్కగా అర్ధం అయ్యేలా చెప్పి పాలసీ చేయించాలి.(concept selling).
📢 మనిషి జీవితం విలువ,కుటుంబ ఆర్ధిక బాధ్యతల విలువను(HUMAN LIFE VALUE),ఆర్థికపరంగా జీవిత బీమాతో ఎలా రక్షణ కల్పించుకోవచ్చో మీరు వివరంగా చెప్పాలి
(calculation of HLV)
.
📢 మనిషి ప్రాణం విలువ కస్టమర్ కి చక్కగా అర్ధం అయ్యేలా చెప్పాలి.(life value for the protection of his family)
.
📢 వడ్డీలు లెక్కలు వేసే కస్టమర్సకి , (వడ్డీల లెక్కలు జీవిత బీమాకు ప్రత్యామ్నాయం కావని) ప్రాణం విలువను వడ్డీలతో పోల్చవద్దని సున్నితం గా చెప్పాలి(no asset is equal to ones life).
📢 మొదటి ప్రీమియం చెల్లించిన తరువాత సంస్థ పాలసీ జారీ చెయ్యగానే పాలసీదారుని పేరు మీద బీమా మొత్తానికి ఒక ఆస్తి(మీకు లేదా మీ వారసులకు) ఏర్పడి పోయినదేనే విషయం మీ కస్టమర్ మనస్సు కి హత్తుకొనేలా వివరించాలి(immediate asset creation after policy issue).
.
📢 ఇదివరకు పాలసీ చేసిన వారికీ కూడా ఇప్పుడు ఉన్న ఆదాయం ప్రకారం ఇంకా ఎంత బీమా మొత్తం అవసరం అనేది వివరించి మరొక కొత్త పాలసీ చేయించాలి.(canvass further policy even customer is having policies).
.
📢 కుటుంబ పెద్దకు జీవితబీమా రక్షణ ఎంత అవసరం అనేది అతనితో పాటు కుటుంభ సభ్యులు అందరికి స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పాలి(all the family must know the importance of head life)
.
📢 కస్టమర్ సంపాదనలో ఎంత శాతం జీవిత బీమా ప్రీమియం చెల్లించటానికి కేటాయించాలో అర్ధం అయ్యేలా చెప్పాలి(allotment to insurance premium from ones income )
.
📢 కస్టమర్ అన్ని అవసరాలకి సరిపడా పాలసీలు ఉన్నాయని వివరించాలి( different policies for various needs of customer)
.
📢 *జీవితభీమా పాలసీ చెయ్యటం వల్ల పొదుపు మరియు కుటుంబానికి రక్షణ ప్రయోజనాలు ఒక్క చోటే పొందవచ్చు అని చెప్పాలి.(twin benefits of savings and insurance cover at a time)
📢 ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్పాలి.( deep knowledge in income tax provisions will fetch further in canvassing ).
📢 బ్యాంక్స్ వడ్డీ రేటు కన్నా కొంచం అటు ఇటు గా మన వడ్డీ రేటు ఉన్నా పాలసీ జారీ చేసిన రోజు న ఉన్న వడ్డీ రేటు తో జీవితాంతం పెన్షన్ ఇస్తామని చెప్పాలి(జీవన్ శాంతి, జీవన్అ క్షయ్,మొదలైనవి)
( standard interest rate through out the life, no fluctuations ).
.
📢 సంపాదన ఉన్న ప్రతి మనిషి కి తిండి, గుడ్డ, గూడు తరువాత జీవితభీమా రక్షణ అత్యవసరం అనేది చక్కగా వివరించాలి.
( understanding life insurance cover also a basic need).
ఎల్ ఐ సి ప్రభుత్వ రంగ సంస్థ. మీ పెట్టుబడులకు ఎలాంటి డోకా లేదని ఘంటాపదం గా చెప్పటం ద్వారా కస్టమర్ లో ఆత్మ స్థైర్యం కలిగించాలి. ( LIC GOVT institution, guarantee for ones investments)
📢 ప్రతి ఏజెంట్ మిత్రుడు పై విషయాలపై తగినంత పట్టు సాధించటానికి తమ డెవలప్మెంట్ ఆఫీసర్స్/క్లియ మిత్రులు/ABM/BM లేదా మీకు నచ్చిన వారి దగ్గర తగిన సహాయ సహకారాలు తీసుకొని నూతన వ్యాపార సేకరణలో మరింత ప్రతిభావంతం గా తయారై ,మీరు కూడా కుటుంబ పరంగా మరియు ఆర్ధికంగా మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలి.ఎల్ ఐ సి రూపొందించిన అద్భుతమైన ఆనంద మాడ్యూల్ ద్వారా కరోనా వేళలో బయటకి వెళ్లి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఇంట్లోనే ఉంటూ ప్రశాంతం గా నూతన వ్యాపార సేకరణ చేస్తే బాగుంటుంది.
మీ
శ్రేయోభిలాషి.
Comments
Post a Comment