పొదుపు కు పెట్టుబడి కి తేడా
What is difference between savings and investment?
Though saving money preserves its nominal value, it's opportunities to grow are limited. While investing, you give your assets the potential to grow over a time-period. Typically, you re-invest your interest, dividends and other capital gains. ... But with the appreciation in money, also comes the risk of losing money.
✍️ మన ఆదాయం లో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును పొదుపు అని అనవచ్చు
✍️ ఆ సొమ్మును ఏదన్నా ద్రవ్య సాధనాలలో పెడితే దానిని పెట్టుబడి అని అంటారు.
✍️ పొదుపు సొమ్మును పెంచుకోవడానికి పెట్టుబడి సాధనాలు అవసరం
✍️ మన కనీస నిత్యావసరాలు, ఆరోగ్య అవసరాలు తీరిన తర్వాత, కొంత మొత్తం అత్యవసర నిధుల క్రింద భద్రపరచుకుంటూ మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి.
✍️ పెట్టుబడులలో అధిక మొత్తాన్ని ఆరోగ్య భద్రత, కుటుంబ భద్రత, భవిష్యత్ ఆర్ధిక భరోసా కోసం కేటాయించాలి.
✍️ ఈ క్రమంలో మొదటి స్థానం ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా కు ఇవ్వాలి. ఈ పెట్టుబడి ఆరోగ్య మరియు ఇతర అవసరాలకు, కుటుంబ భద్రత కు నిధులను సమకూరుస్తుంది.
✍️ ఈ ఏర్పాటు చేసుకుంటే మానసిక ప్రశాంతత పెరిగి ఆందోళన లేని జీవనాన్ని గడుపుతాము. తద్వారా అరోగ్య ఖర్చులు తగ్గుతాయి బీమా ద్వారా వచ్చిన ధీమా తో నాణ్యమైన జీవితాన్ని పొందగలుగుతాము.
✍️ ఇప్పుడు నిశ్చింతగా ఇంకా మిగిలిన సొమ్మును మీకిష్టమైన ఇతరపెట్టుబడి సాధనాలకు కేటాయించవచ్చు. అయితే ఎంత పెట్టుబడి పెడితే సుమారుగా ఎంత రాబడి వస్తుంది అని ఒక లెక్క వెయ్య వచ్చు. ఇంకో విధంగా ఎంత రాబడి రావాలో తెలిస్తే దాని కోసం ఎంత పొదుపు చెయ్యాలో తెలుస్తుంది.
✍️ ఇంట్లో సొమ్ము దాచి పెట్టుకోవటానికి ఎలాంటి ప్లానింగ్ అవసరం లేదు. కానీ ఆ సొమ్ము ను మంచి రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలంటే చక్కని ప్రణాళిక ఉండాలి.
✍️ ఖర్చులు తగ్గించు కొంటూ ఆదాయం పెంచు కొంటూ ఉంటే పొదుపు మొత్తం పెరుగుతుంది. ఈ పొదుపు మొత్తం తగిన విధం గా పెట్టుబడి పెడితే వచ్చే రాబడి వల్ల ఆదాయం పెరిగి తద్వారా పొదుపు మరింతగా పెరుగుతుంది.
.
✍️ ఇంట్లో దాచుకొన్న పొదుపు సొమ్ము భద్రత పరంగా భయాన్ని కలిగిస్తే పెట్టుబడి పెట్టిన సొమ్ము ధైర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.
.
✍️ ఆదాయ, వ్యయాలలోని తేడా వలన పొదుపు మొత్తం సమకూరుతుంది. ఆ పొదుపు ద్వారా రాబడులను పొందాలంటే భద్రత తో కూడిన సాధనాలలో పెట్టుబడి పెట్టాలి.
.
✍️ పొదుపు లో ధనాన్ని పోగుచెయ్యటం అయితే పెట్టుబడి లో ధనాన్ని సృష్టించటం.
.
✍️ వివిధ రకాలయిన పెట్టుబడి సాధనాల మీద మీకు సరి అయిన అవగాహన లేదని చింతిస్తున్నారా? నష్టభయం ఉంటుందని భయపడుతున్నారా?మీ పెట్టుబడులకు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నిశ్చింతగా నిశ్చయ మైన రాబడి జీవితాంతం రావాలని కోరుకొంటున్నారా?.
✍️ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ ఐ సి లో మీ పొదుపు ని పెట్టుబడి గా పెట్టండి. స్థిరమైన రాబడి తో జీవితాంతం నిశ్చింతగా ఉండండి
✍️ జీవితబీమా రక్షణ తో కూడిన స్థిరమైన రాబడి కూడా పొందవచ్చు.
Comments
Post a Comment