డెవలప్మెంట్ ఆఫీసర్ పనేంటి?


     డెవలప్మెంట్ ఆఫీసర్ కు అటు రిక్రూట్మెంట్ కు కానీ ఇటు అపోయింట్మెంట్ కి కానీ ఎలాంటి అధికారం లేదు.కేవలం అతనొక స్పాన్సరర్ మాత్రమే. కానీ  ప్రతినిత్యం అతన్ని "ఎంతమందిని రెక్రూట్ చేశావు?  లేదా అపాయింట్ చేస్తావు? అని అడుగుతుంటారు.

ఇది  వ్యాపారంతో కూడిన ఉద్యోగం.  ఇందులో బాగా రాణించడమన్నది ఏజంట్ల నియమకంతో ముడిపడివుంది అన్నది మాత్రం నిర్వివాదాంశం.

అయితే  ఈ ఏజన్సీ నియామకం అన్నది ఓ సంక్లిష్టమైన  ప్రక్రియ. 

మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి? ఈ విధి నిర్వహణ నిర్వర్తించడం ఎలా?

ఈ ప్రశ్నలకు జవాబులు వెతకడంలో ఎంతో మేధో మధనం జరుగుతున్నప్పటికీ , ఇదే అనుసరించవలసిన  నిర్దిష్టమైన మార్గం  అని, చెప్పే మార్గనిర్దేశం చేసే సమాధానం మాత్రం లేదు.

ఎన్ని శిక్షణా కార్యక్రమాలకి హాజరైనా, 
ఎన్ని పుస్తకాలు చదివినా, 
ఎంతో సాంకేతికతతో పనిచేసినా, 
ఈ  విషయంలో విజయం సాధించిన వారిని అనుకరించినా , 
ఫలితం మాత్రం  ఆశించినంతగా వుండటం లేదన్నది మాత్రం నిజం.

మరి అందరికీ  ఆమోదయోగ్యమైన సక్సస్ మంత్రమేదైనా ఉందంటే అది డెవలప్మెంట్ ఆఫీసర్ గా అపోయింట్మెంట్ నుండి రిటైర్ అయ్యే వరకు ఏజంట్లను మనకు బుద్దిపుట్టినట్లు నియమించుకుంటు పోవడమే.
దీనికి అదనంగా వారి వారి ప్రాప్తం బట్టి, అలౌట్మెంట్స్, అటాచ్మెంట్స్, వల్ల కొంత ఏజంట్ల సంఖ్యా బలం పెంచుకోవచ్చు.

ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ తన క్రింద పని చేయవలసిన ఏజంట్ల పట్ల ఎటువంటి పాలనా పరమైన అధికారాలు కానీ, నియంత్రణ కానీ లేకపోయినా కేవలం సత్ సంబంధాల ఆధారంగా మాత్రమే , ఏజన్సీ ఫోర్స్ ని ఏజన్సీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసేటట్లు పనిచేయాలి. వారిని ప్రొడ్యూక్టీవ్ గా తీర్చి దిద్దాల్సి ఉంటుంది. క్లబ్ మెంబెర్స్ ని చెయ్యాల్సి ఉంటుంది.
బహుశా ఈ కారణంగానే డెవలప్మెంట్ ఆఫీసురుగా రిటైర్మెంట్ వరకు ఎటువంటి బదిలీ లేకుండ ఉన్న ప్లేస్ లొనే ఉండేటట్లు ఈ పోస్టు డిజైన్ చేయబడింది కాబోలు.

ఈ నేపథ్యంలో,  వ్యాపారముతో ముడిపడిన ఈ ఉద్యోగంలో రిటైర్మెంట్ వరకు స్థిరపడటమా లేదా ఎలాగో  కావాల్సిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకొని ప్రమోషన్ తీసుకొని వెళ్లాడమా అనే నిర్ణయం త్వరితగతిన తీసుకోవడం ఉత్తమం.

ఒక వేళ స్థిరపడటానికే సిద్ధపడినట్లయితే ఈ ఉద్యోగంతో ముడిపడిన ఏజన్సీ నియకం పట్ల
ఎక్కువగా శ్రద్ద వహించాలి.లేక పోతే దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు అవుతుంది.

ఈ క్రింది ప్రశ్నలకు సరైన జవాబులు ఎవరికి వారు శోధించి ఒక పేపరు పై రాయండి.


1)  ఈ ఉద్యోగ నిర్వహణ సాజువుగా ఎటువంటి వత్తిడి లేకుండా చేసుకోవాలంటే ఎంతమంది ఏజంట్లను నియమించుకోవాలి. ?

2)ఎంతమందిని పెట్టితే ఎంతమంది నికరంగా నిలబడతారు.?

3) నిలబడినవారిని ఎంతమందిని క్లబ్ మెంబెర్స్ గా మలుచుకోవచ్చు.?

4) ఏజంట్లతో దీర్ఘకాలిక సత్సంబంధాలు  ఎలా కలిగి ఉండాలి?

5) మన కాస్ట్ కి కావాల్సిన ప్రీమియం ఏ కొంతమంది ఏజంట్ల మీద ఆధార పడకుండా సమతుల్యతను పాటిచుకోవడం ఎలా?

6) ఒకవేళ మంచి ఇన్సెంటివ్ తీసుకోవాలంటే , ఏజట్లను   మనకు అనుగుణంగా ఉండేటట్లు ఎలా చూసుకోవాలి?

7) చివరిగా అలాటెడ్ ఏజన్సీల మీద ఆశలు ఎక్కువ పెట్టుకోక, వారిని మనకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి?

పై ప్రశ్నలకు సబంధించి  అధిక సంఖ్యలో ఏజంట్లను కలిగిన కొంతమంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ మిత్రలను అడిగినప్పుడు వారిచ్చిన సమాధానాల సారాంశం ఏమనగా...


1) ఈ ఉద్యోగంలో చేరినప్పటినుండి కనీసం 10 సం,, ల వరకు విధి నిర్వహణలో ఒక భాగంగా  ఏజన్సీ నియామకం కొరకు నిరవధికంగా శ్రమించాలి.

2) ఒక మార్కెటింగ్ లీడర్ గా ప్రతి నిత్యం మన దైనందిన జీవితంలో  మనం చూస్తున్న వ్యక్తులలో మనకు ఏజన్సీకి పనికివచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నరేమో అని  నిరంతరం పరిశీలిస్తూ , ఏరోజుకు ఆరోజు ఒక డైరీలో వారి గురించి విధిగా నమోదు చేయాలి.  ఇలా వ్రాసుకున్న పేర్లు కనీసం నెలకు 15 కి తక్కువ లేకుండా ఉండాలి.

3) అలా నమోదు చేసిన వాళ్ళతో పరిచయం చేసుకుని, వాళ్ళ మనస్తత్వాన్ని అనుసరించి వీలుచుసుకొని వాళ్లకు ఏజన్సీ ఇవ్వడం ఒక పనిగా పెట్టుకోవాలి.

4) ఎవరినైనా కలసి మాట్లాడంటే బిడియం, ఏమనుకుంటారో అని ఫీలింగ్స్, ఆడిగినాక వద్దంటే మన ప్రెస్టీజ్ ఎక్కడ దెబ్బతింటుందో అన్న అనుమానం, ఏమిఆడిగి ఏమి సాధిస్తాములే అనే నైరాశ్యం, విజిటింగ్ కార్డ్ ఇచ్చి వాళ్ళకిష్టమైతే వాళ్ళే మనదగ్గరకు వస్తారనే అతి విశ్వాసం , మన పోస్టుకి అస్సలు సూట్ కానీ విషయాలు.

4) వ్యక్తిగతంగా ఇదివరకు ఏజన్సీ ప్రాతినిధ్యం లేని ప్రదేశాలు మరియు ఇతర ఏజంట్లకు బాగా ఫలితాలు ఇస్తున్న ప్రదేశాలని గుర్తించి , తరచు అక్కడికి రాకపోకలు సాగిస్తూ ( వీలైతే ప్రతిరోజు) అక్కడి వారితో పరిచయాలు పెంచుకుని,  సేల్స్ నైపుణ్యంగల వారిని లేదా ఎవరినో ఒకరిని ఏజంటు గా నియమించడం. ఫలితంతో సంబంధం లేకుండా తరచు అక్కడికి వెళ్లి కొద్దిసేపు అక్కడి వ్యక్తులతో గడపడం.


5) ప్రతి ఆర్థిక సం,, ము మొదటి క్వార్టర్లో నూతన వ్యాపారం మందకొడిగా ఉంటుంది కాబట్టి,  ప్రత్యేకించి ఆసమయాన్ని ఏజట్ల నియామకం కోసం శ్రద్ద పెట్టడం.

6) పాలసీదారులకు సేవలు అందించే సమయంలో, వారిని కానీ వారిద్వారా వారికి తెలిసినవారికి గానీ ఏజన్సీ కాన్వాస్ చేయడం ఒక  విధిగా పాటించడం.

6) కనీస విద్యార్హత కలిగి,  కొంత ఆకట్టుకునే మాటతీరు గల వ్యక్తులు మనకు కనిపించినప్పుడు తప్పక వాళ్ళతో టచ్ లో ఉండి, వారి నడవడిక, అలవాట్లను , వారి ప్రవర్తనను గమనించి వారికి ఏజన్సీ గురించి చెప్పి  వారిని ఒప్పించే వరకు నిరంతరంగా ప్రయత్నం చేయడం.

7)మనీ రొటేషన్లో  లేక  అధికంగా సంపాదన కలిగి లెక్కలు  చూపించుకోలేక అవస్థ పడుతున్న వారిని కలసి , ఏజన్సీ ద్వారా వారి సంపాదనను  అధీకృత మనీగా, ఏజన్సీ ద్వారా మార్చుకొనే అవకాశాన్ని వివరించడం.

8) ప్రైవేట్ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, హెల్త్ వర్కర్స్, ప్రైవేట్ క్లర్క్స్, మొదలగు వారిని కలసి, RCA  ఏజన్సీ కాన్వాస్ చేసి వారు ప్రస్తుతం సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ సపాదించుకునేందుకు అవకాశము కలదని వారిని ఒప్పించడం.

9) సామాజిక వర్గ సంఘాలకు సంబంధించిన సెక్రటరీ , ప్రెసిడెంట్,  ఇతర కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు, వృత్తి సంఘాల నాయకులను కలసి వారికి  ఏజన్సీ ద్వారా సోషల్ కమిట్మెంట్ కు అవకాశం ఉంటుందని చెప్పి ఒప్పించడం.

10) అల్ ఇండియా యావరేజ్ ప్రకారం 50 మంది ఏజట్లు  మనదగ్గర ఉండాలంటే కనీసం 3 రెట్లు అనగా 150 మందిని నియమించాలి. అలాగే 200 మందిని అధిక పక్షంలో నియమించినట్లైతే 25 మంది క్లబ్ మెంబెర్స్ తయారువుతారు. ఆ తరువాత టెర్మినషన్స్ కి అనుగుణంగా రెక్రుట్మెంట్ బాలన్స్ చేస్తూ ఉండాలి.

11) అన్నిటికి మించి, కళ్ళు, చెవులు, కాళ్ళు, నోరు, మెదడు, ఉపయోగించి , ఫలితాన్ని పక్కనబెట్టి, నిరంతర పరిశ్రమ కనీసం 10 సం,,లు చేసి 40 నుండి 50 మంది ఏజంట్లు, కనీసం 20 మంది క్లబ్ మెంబెర్స్ నికరంగా ఉండేటట్లు మైంటైన్ చేసుకుంటే ఇక రిటైర్మెంట్ వరకు "తిరుగులేని కింగ్" నీవే అని రుజువు చేసే ఉద్యోగం మనది.



___మల్లిక్.


Comments

  1. బ్లాగ్ బాగుంది..good initiation..kudos

    ReplyDelete
  2. మల్లిక్ sir కి,పోస్ట్ చేసిన మీకు థాంక్స్.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు