లక్ష్య సాధన ప్రణాళిక


"ఆలోచించి నిర్ణయం  తీసుకోవాలి. నిర్ణయం తీసుకొన్నాక ఆచరణేగానీ, ఆలోచన చేశామంటే నిర్ణయం తీసుకోలేదని అర్థం.”

  లక్ష్యం చేరటానికి ఏమి ఇవ్వటానికి (త్యాగం?) సిద్ధంగా ఉన్నాం? అది మన దగ్గర ఉందా? లేకపోతే ఎలా వస్తుంది? మీకు గమ్యం, లక్ష్యం ఎంత ముఖ్యమో దాన్ని బట్టి ఇవి ఇవ్వటానికి సిద్ధపడగలరు. ప్రయత్నం చేస్తాను, అప్పుడు చూస్తాలే, ఇంకా ఆలోచించలేదు. అనే మాటలు పనికిరావు. నీ గమ్యం, నీ లక్ష్యం నీకు ప్రాణప్రద మైనప్పుడు, దానికి కావలసిన సమయం, డబ్బు, ఆరోగ్యం సహజంగానే వస్తాయి.

లక్ష్యం నిర్ణయం స్వయంగా చేసుకొన్నా, మీకన్నా అనుభవజ్ఞులు లేదా మీరు సాధించాలను కొన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించినవారిని వెతికి పట్టుకొని, వారితో మీ లక్ష్య సాధన ప్రణాళిక చర్చించండి. వారి అనుభవాన్ని వాడుకొని మీ ప్రణాళికలో చిన్నచిన్న మార్పులు చేసుకొని లక్ష్యసాధనకు పురోగమించండి.

"భయం, బద్ధకం, మార్చుకోలేని అలవాట్లు విజయానికి ప్రతిబంధకాలు"

లక్ష్య సాధనకు ఇంకొక ముఖ్యమైన లక్షణం స్థిరమైన పట్టుదల. శ్రద్ధ, మొక్కపోని ఆత్మ విశ్వాసం, అడ్డంకులు, ఓటమిలను ఒప్పుకోని మనస్తత్వం. లక్ష్యం సాధించటం మీదే దృష్టి అడ్డంకుల మీద కాదు. లక్ష్య సాధన, విజయం రోజూ చేసే నిర్దుష్టమైన పనుల మీద ఆధారపడుతుంది. ఏ రోజుకారోజు ఎంత ఫలితమొచ్చిందని చూడద్దు. మీరు విత్తనం వేశారు. రోజూ నీరు పోస్తున్నారు. పైకి కనపడకపోయినా విత్తనం భూమిలోపల మార్పులు చేసుకొంటోంది. ఎక్కువ కాలం ఫలాలనిచ్చే వృక్షాలు మొలకెత్తటానికెక్కువ సమయం పడుతుంది కదా! 

ఇపుడు మీ లక్ష్యాలనూ గమ్యాలను, నెలవారీగా, వారం వారీగా రోజూవారీగా చేయవలసిన పనులుగా మదింపు చేసుకోండి. పండు మీద ఇష్టం ఉన్నంతకాలం, చెట్టు ఎక్కటం బాధనిపించదు. దృష్టి పండు మీంచి మరలిందంటే, అడుగడుగునా కష్టాలే కనిపిస్తాయి. మీ లక్ష్యం మీద మీకు పరిపూర్ణమైన దీక్ష, విశ్వాసం, దృఢత్వం ఉంటే మీ లక్ష్యం సాధించి తీరుతారు.

"బీదరికం, మనకి మనం పెట్టుకొనే శాపం” "దిశమారితే దశ మారుతుంది"

"మీరూ ఊహించింది మీరు నమ్మగలిగితే మీరు సాధించి తీరుతారు." - నెపోలియన్ హిల్ "లక్ష్యం సాధించాలంటే ప్రణాళిక, ఆచరణ కావాలి. సాధించలేకపోవటం అంటే ఇవి లేకపోవటమే. దానికి ప్రత్యేక ప్రయత్నం అవసరం లేదు.”

ఈ జీవన గమ్యాన్ని, చిన్న చిన్న లక్ష్యాలుగా ఎలా మార్చుకోవాలో వాటిని అంచెలంచలుగా ఎలా సాధించుకోవాలో మీ గురుతుల్యుల్ని (మెంటర్ని) అడిగి తెలుసుకోండి. లేదా రాబోయే మరో పుస్తకం కోసం ఎదురు చూడండి. కానీ గమ్యాన్ని లక్ష్యాన్ని మాత్రం మననం చేస్తూ ఉండండి.

"నా జీవితం నేను నా 3 పద్ధతిలో జీవించి సాఫల్యం సాధిస్తాను. ఇది నా నిర్ణయం" "When the going gets tough, the tough gets going"

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality