యల్.ఐ.సి. అడ్వైజరు పొందే ఆదాయాలు
1.కమీషన్లోని రకాలు:
మొదటి సంవత్సర కమీషన్; బోనస్ కమీషన్;
రెన్యూవల్ కమీషన్;
ఇవి ఏజెంట్లకు చెల్లింపబడతాయి.
2.హెరిడిటరీ కమీషన్: ఇది ఏజెంట్ జీవితానంతరం వారసులకు రెన్యూవల్ కమీషన్ గా చెల్లిస్తారు.
ఇదొక మహత్తరమైన వృత్తి. ఒక డాక్టరు లాగా, లాయరు లాగా ఇన్సూరెన్స్ అడ్వైజర్ కూడా ఒక వృత్తి.
అందువల్ల మీరు కోరుకున్నంత ఆదాయం ఈ వృత్తిలో పొందవచ్చు. ఇంతవరకు బీమా చెయ్యతగిన వ్యక్తులలో కేవలము 25% శాతం మంది మాత్రమే పాలసీలు చేశారని ఇటీవల ఐ ఆర్ డి ఏ సర్వే చెపుతోంది.
పైగా జనాభా పెరుగుతూనే ఉంటుంది. కనుక ఈ వ్యాపారం ఆగిపోయే ప్రసక్తే రాదు. ఆర్థిక సంస్కరణల వలన ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. దానివలన ఇప్పుడు పెద్ద పెద్ద పాలసీలు లభిస్తున్నాయి. ఈ వృత్తిని చెయ్యడానికి మీకు అధిక విద్యార్హతలు, అధిక పెట్టుబడులు, ఆఫీసు బిల్డింగు, ఉద్యోగులు అవసరము లేదు. మీ సమయము, మీ మాటలే మీ పెట్టుబడి. సత్సంబంధాలే మీ బలం. అయితే కస్టమర్లను వారి ఇంటివద్ద కలుసుకుని మన పథకాలను వారికి అర్ధమయ్యే విధంగా వివరించాలి. దానికోసం మీరు ఎక్కువగా తెలిసిన వారినందరినీ కలవాలి. ఒక క్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తూ పోతే మీకు లభించే ఆర్థిక ప్రయోజనాన్ని క్రింది పట్టికలో గమనించండి.
పది సంవత్సరములపాటు సంవత్సరానికి రు.10 లక్షల చొప్పున ప్రీమియం సాధిస్తే మీకు లభించే కమీషను ఈ క్రింది పట్టికద్వారా తెలుసుకోండి.
ఏ కారణము చేతనైనా 10 సం.ల తరువాత ఏజెన్సీ వృత్తిని వదిలివేసినా , ఏజంటు వారసులకు సం.నికి రు.5 లక్షల చొప్పున ప్రీమియంలు చెల్లిస్తున్నంత కాలం కమీషన్ వస్తూ వుంటుంది.
5 సంవత్సరాలపాటు పనిచేసి మానేసినా కొన్ని నిబంధనలకు లోబడి పాలసీలపై ప్రీమియములు చెల్లించుచున్నంతకాలమూ కమీషన్ లభిస్తూనే ఉంటుంది. ఐదు సంవత్సరాలపనికి జీవితాంతం ప్రతిఫలం లభించే వృత్తి, ఎల్ ఐ సి ఏజెన్సీయే! పైగా ఏజెంట్ తదనంతరం కూడా అంతే ఆదాయం ఏజెంట్ భార్యా పిల్లలున్నంతకాలమూ లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఈ వ్యాపారం చేస్తే క్లబ్ మెంబర్ అవుతారు. దానివలన ఏజెంట్ కు మరిన్ని ప్రోత్సాహకాలు, మరింత ఆదాయము లభిస్తుంది.
LIC ఏంట్లందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా రక్షణ కల్పిస్తోంది.
ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ బీమా మొత్తము 01.09.2021 నుండి పెంచారు.
పెరిగిన గ్రూప్ ఇన్సూరెన్సు :
1) 3 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ కల ఏజెంట్లకు - 3 లక్షల బీమా మొత్తం - ప్రీమియం - Rs.1,328.
2) 3 నుండి 5 సంవత్సరాల లోపు వారికి - 5 లక్షల బీమా మొత్తం - ప్రీమియం - Rs.2,212.
3) 5 నుండి 10 సంవత్సరాల లోపు వారికి - 7 లక్షల బీమా మొత్తం - ప్రీమియం - Rs.3,098.
4) 10 సంవత్సరములు దాటిన వారికి - 12 లక్షల బీమా మొత్తం - ప్రీమియం - Rs.5,310.
ఈ ప్రీమియం కూడా ఏజెంట్ కమిషన్ నుండి మాత్రమే రికవరీ జరగాలి.
LIC ఈ ప్రీమియంను 5 దఫాలుగా కమిషన్ లో రికవరీ చేస్తుంది.
మంచి సమాచారం..బ్లాగ్ బాగుంది
ReplyDelete