బీమా వల్ల వచ్చే లాభాలు

        pc: bpi.philam.com
బీమా సురక్షితమైన పెట్టుబడి.  దీనిపై  కనీస రేటులో గ్యారెంటీ లాభాలు ఉంటాయి. మనం ఎంచుకున్న కాలపరిమితి లో ఆ లాభాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 

ప్రీమియం  చెల్లించమని గుర్తు చేసే కాల్స్ ప్రతి ఒక్కర్నీ తప్పనిసరిగా పొదుపు (సేవింగ్స్) చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకునేలా ప్రోత్సహిస్తాయి. ఇది బలవంతంగానైనా పొదుపును ప్రోత్సహిస్తుంది.

 పెట్టుబడి నిర్వహణకు సంబంధించి బీమా సంస్థ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటుంది. దాని ద్వారా  వ్యక్తికి ప్రశాంతత ఇస్తుంది.ఒక భరోసా లభిస్తుంది.

బీమా లిక్విడిటీీని అందిస్తుంది. పాలసీదారుడు లోను తీసుకోవచ్చు లేదా పాలసీని అప్పగించి  దాన్ని నగదులా మార్చుకోవచ్చు.అనుకోని ఖర్చు లకు ఇది తక్షణం స్పందిస్తుంది.

 జీవిత బీమా ద్వారా కొన్ని రకాల ఇన్కంటాక్స్ ప్రయోజనాలు కలుగుతాయి.

 బీమాదారు దివాలా తీసినా లేదా అతడు చనిపోయినా అతను  క్రెడిటర్ల క్లయిం నుంచి తప్పించుకోగలుగుతాడు.  దీనిని బట్టి మనకు తెలిసేదేమంటే బీమా వ్యక్తి భద్రతకు సంబంధించిందని అర్థం.

బీమాదారు ఆకస్మికంగా కరోనాలాంటి సహజంగా వచ్చే జబ్బుతోనో, ప్రమాదవశాత్తు తోనో మరణించినప్పుడు కుటుంబానికి ఆసరాగా బీమా నిలుస్తుంది.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality