బీమా లో ఏమేమి ఉంటాయి?

         Photo: pinterest

          దేనినైనా బీమా చేయాలంటే 
 మొదట అది ఒక ఆర్థిక విలువ కలిగిన ఆస్తి అయి ఉండాలి. ఆ ఆస్తి ఏదైనా భౌతిక వస్తువు (Physical) కావచ్చు.ఉదా:కారు, ఇల్లు  లేదా
భౌతిక వస్తువు కానిది (non-physical) కావచ్చు.ఉదా:పేరు ప్రతిష్టలు, గుడ్విల్ (goodwill) లేదా  వ్యక్తిగతం  కావచ్చు ఉందా: కళ్లు, అవయవాలు, శరీరంలో ఇతర అవయవాలేవైనా.

     ఏదైనా ఒక  సంఘటన జరగడం వల్ల ఆస్తికి  నష్టం జరిగొచ్చు. దీనినే రిస్క్ అని అంటారు. రిస్క్ జరగడానికి అయ్యే  కారణాన్ని 'ఆపద' (Peril) అంటారు.

       బీమా 'సమీకరణ' లేదా 'పూలింగ్' (Pooling) అనే సూత్రం పై ఆధారపడి పనిచేస్తుంది. పూల్  అంటే నిధి లో వివిధ రకాల వ్యక్తులనుంచి సేకరించబడిన వ్యక్తిగత కాంట్రిబ్యూషన్లు ఉంటాయి. ఈ కాంట్రిబ్యూషన్లను  'ప్రీమియంలు' అంటారు.
ఇలా నిధి (ఫండ్స్)ని సమీకరించి, కొందరు అభాగ్యులకు నష్టపరిహారంగా చెల్లించే సంస్థనే బీమా సంస్థ (ఇన్సూరర్) అంటారు.బీమా సంస్థ (ఇన్సూరర్) ఈ పథకంలో పాల్గొనే ప్రతి  వ్యక్తితో
కాంట్రాక్టు చేసుకుంటుంది.అలా పాల్గొనేవారని పాలసీదారు అంటారు.
        పాలసీలో ప్రతి సంవత్సరం వసూలు చేసే ప్రీమియం లో కొంతభాగం పాలసీదారు ప్రయోజనం కోసం నిల్వచేస్తుంది. దీనిని "రిజర్వ్" అంటారు.ఇది ఐఆర్డిఏ నిబంధన కూడా. బీమా సంస్థ నిర్వహించాల్సిన బాధ్యతల కోసం కొద్ది మొత్తం నిల్వ చేస్తుంది. దీనిని "జీవిత నిధి" అంటారు. 
    ప్రిమియంలో రెండు అంశాలు ఉంటాయి.
ఒకటి టెర్మ్ అంటే రిస్క్ కోసం. రెండు పొదుపు కోసం.అందువల్ల బీమా లో రిస్క్ రక్షణ, పొదుపు కలగలిసి ఉంటాయి.
     

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality