జీవిత బీమా చేయడం పొదుపుకు మార్గం
ప్రతి మనిషి తాను సంపాదించిన సొమ్ములో కొంచమైనా పొదుపు చేయకపోతే అతని వృద్ధాప్యంలో గాని, మధ్యలో అనారోగ్యానికి గాని,ఏదైనా అవసరం వచ్చినా చాలా ఇబ్బందులకు గురి అవుతాడు. అందువలన ప్రతి వ్యక్తి పొదుపు చేసుకోవాలి. ఆ పొదుపు చేయగలిగినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. దుబారా చేస్తే మాత్రం భవిష్యత్తు లో చింతాల్సి వస్తుంది. చాలా మందికి ఎందులో పొదుపు చేయాలో తెలియదు. ఏది సరైన పథకమో చాలా మందికి తెలియదు. ఖర్చు చేయడంలో గలిగినంత ఉబలాటం పొదుపు చేయడంలో ఉండదు. వీటిని తెలుసుకోవడమే ఆర్థిక అక్షరాస్యత అంటారు. కన్నడ భాషలో ఒక సామెత ఉంది."దాచిన రూపాయి నీది.వాడిన రూపాయి వాడిది."
పిల్లల చదువు సంధ్యలు, పెళ్లి, పేరంటా లు, ముసలితనం ఇవన్నీ జీవితంలో ఉంటాయి. అప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది.దిగులుతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. డబ్బు లేకపోతే దుబ్బుకైనా పనికిరాడు అని కూడా అంటారు. కరోనా లాంటి జబ్బులు వస్తే ఆస్పత్రిలో దాదాపు రెండు లక్షలు ఖర్చవుతుంది. అనుకోకుండా వచ్చే ఇలాంటి ఖర్చులు భరించాలంటే ప్రతి నెలా కొంత సొమ్మును పొదుపు చేయాలి. ఈ పొదుపు జీవిత బీమా ద్వారా సాధ్యమవుతుంది.జీవిత బీమా పాలసీ చేయడం ద్వారా పొదుపు అలవాటు అవుతుంది. ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అంటే పాలసీ చేసిన వ్యక్తి ఒక ఏనుగు లాంటి వాడన్నమాట. తెలుగులో ఒక సామెత ఉంది చచ్చినా ఏనుగే బతికినాఏనుగు ఏనుగే. అంటే పాలసీ చేసిన వ్యక్తి అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోయినా, చివరి దాకా బతికినా డబ్బు వస్తుందని అర్థం. తన అవసరాల నిమిత్తం పాలసీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. వృద్ధాప్యంలో కొంత పెద్ద మొత్తాన్ని పొందవచ్చు లేదా పెన్షన్ లాగా మార్చుకోవచ్చు.ఇన్ని సౌకర్యాలున్న జీవిత బీమా ను ప్రతి వ్యక్తి మొట్టమొదట చేసుకోవాలి.
దయచేసి కింది లింక్ open చేయండి.
https://liccareerin.wixsite.com/mysite
Comments
Post a Comment