బీమా కాంట్రాక్టు


        ‌pc: iedunote.com
బీమా ఒక కాంట్రాక్టు. అంటే ఒక అగ్రిమెంటు.ఒక ఒప్పందం. బీమా పాలసీ బీమా సంస్థ కు, బీమాదారుడు అంటే పాలసీ హోల్డర్ - ఈ ఇద్దరి  మధ్య ఉండే కాంట్రాక్టు. బీమా కాంట్రాక్టు కాబట్టి ఇది చట్ట పరిధిలోకి వస్తుంది. ఇది భారతీయ కాంట్రాక్టు చట్టం 1872 కు లోబడి ఉంటుంది.ఈ కాంట్రాక్టు కు సాక్ష్యంగా పాలసీడాక్యుమెంట్
(పాలసీబాండు) ఉంటుంది. పాలసీ దారుడు తన మొదటి కంతు ( ప్రిమియం) కట్టినప్పుటి నుంచి పాలసికాంట్రాక్టు ప్రారంభమవుతుంది.

బీమా కాంట్రాక్టు కున్న ప్రత్యేక లక్షణాలు (Special Features)

a) ఉబెర్రిమ ఫైడ్స్ (Uberrima Fides) లేదా పరిపూర్ణ విశ్వాసం (Utmost Good Faith)

 1.బీమా కాంట్రాక్టు పాటించే ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. దీన్ని ఉబెర్రిమ ఫైడ్స్ అనంటారు. దీనర్థం ఏమిటంటే  కాంట్రాక్టులో ఉన్న ప్రతి పార్టీ బీమా విషయానికి సంబంధించి తనకు తెలిసిన అన్ని భౌతిక వాస్తవాలూ వెల్లడించాలి. అంటే 
బీమా చేసే వ్యక్తి తన వైద్యపరమైన చరిత్ర, వంశపారంపర్యంగా వస్తున్న లక్షణాలు, ధూమపానం, మద్యపానం వంటి లక్షణాలు, పనికి వెళ్లకపోవడం, వయసు, హాబీలు , ఆదాయ వివరాలు వంటి ఆర్థిక సమాచారం, ముందుగా ఉన్న జీవిత బీమా పాలసీలు, వృత్తి మొదలైనవన్నీ తెలియజేయాలి.ఇలా పరిపూర్ణ విశ్వాసం తో పాలసీ దారుడు అన్ని విషయాలు తెలియజేయాలి.

2.బీమా దారుని అంటే పాలసీదారుని కి బీమా ఇవ్వొచ్చా లేదా అని(రిస్క్ కవర్)  నిర్ణయించడంలో  బీమా ఏజెంట్ ఇచ్చే వివరాలు,  ప్రీమియం రేటు, ఇంకా ఇతర నియమ నిబంధనల్నీ ప్రభావితం చేసే వాటిని భౌతిక వాస్తవాలు (Material facts) అంటారు.
 పాలసీ పూర్తయ్యాక ఎలాంటి భౌతిక వాస్తవాలు
వెల్లడించాల్సిన అవసరం లేదు. పాలసీ ప్రీమియం లు సకాలంలో చెల్లించక ల్యాప్స్ చేసుకుని మళ్లీ దాన్ని పునరుద్ధరణ (రివైవల్) చేసుకునేటప్పుడు మాత్రం మళ్లీ తనకు సంబంధించిన భౌతిక వాస్తవాలు వెల్లడించాల్సి ఉంటుంది.

3. పాలసీ దారునికి ఇన్సూరెన్స్ సంస్థ కు మధ్య కాంట్రాక్టు కు చట్ట ప్రకారం ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే బీమా చేయడంలో ఉన్న ఆసక్తి ఉండాలి.
       పాలసీదారుడు బీమా చేస్తున్నప్పుడు పాలసీదారునికి నామినీ కి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండాలి.అదే నిజమైన ఆసక్తి.అలా లేకపోతే అది జూదం అవుతుంది. జూదం చట్టబద్దం కాదు. ఇలాంటి సరైన సంబంధం ఉండటాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. 

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality