ప్రజలధనం ప్రజల కొరకే
1956కు ముందు కనీసం 200 ప్రైవేటు బీమా సంస్థలు భారతదేశంలో రాజ్యమేలుతున్నాయి. అయితే అవి ఎక్కడా ఎలాంటి పరిస్థితులలోనూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేపోయాయి. బీమా రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పటిష్టం చేసి దేశ మౌళిక స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశ్యంతో అప్పటి ఆర్థిక మంత్రి పిడి దేశ్‌ముఖ్ నాటి ప్రధాని నెహ్రూ ఆమోదంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే భారతీయ జీవిత బీమా సంస్థ స్థాపనకు పునాది వేసింది. అందుకు అనుగుణంగానే 1956 సెప్టెంబర్ 1న రూ.5 కోట్ల మూలధనంతో భారత ప్రభుత్వం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం ద్వారా 1956 సెప్టెంబర్ ఒకటిన ఎల్ఐసిని స్థాపించింది.
అప్పుడు LIC లో ప్రభుత్వ ప్రాధమిక పెట్టుబడి 5 కోట్లు కాగా, ఇప్పుడు 100 కోట్లగా ఉంది.గత సంవ6 డివిడెండ్ రూపంలో 2698 కోట్లు LIC ప్రభుత్వానికి అందజేసింది.అదికాకుండా పన్నుల రూపంలో 10670 కోట్లు చెల్లించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పుడంటే అప్పుడు, ఎంత కావలసి వస్తే అంత మొత్తంలో నిధులు సమకూర్చి పెడుతున్న కామధేనువు వంటి సంస్థ ఇది.
ఎల్ ఐ సి లక్ష్య వాక్యం యోగక్షేమం వహామ్యహం అనే భగవద్గీతా వ్యాక్యం.
1వ పంచవర్ష ప్రణాళికలో LIC పెట్టుబడి రూ. 9,21, 371 కోట్లు.దేశంలో ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే రోడ్లు, నీటిపారుదల,ఎలక్ట్రి సిటీ, డ్రెయినేజ్ మొ|| వాటిలో LIC పెట్టుబడు లు రూ. 1,89,265 కోట్లు.
రైల్వేలకు రూ.1.50 లక్షల కోట్లు, భారత్ మాల హైవే ప్రాజెక్ట్‌కు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఎల్‌ఐసీ సమకూరుస్తోంది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన నాటి నుంచి నేటి వరకూ- అంటే పన్నెండో పంచవర్ష ప్రణాళిక అంతమయ్యే 2017 నాటివరకు రూ.20లక్షల కోట్లను ప్రభుత్వాలకు పెట్టుబడులుగా అందించింది ఎల్‌ఐసీ.
12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి మొత్తంగా 27.75 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చింది. 13వ పంచవర్ష ప్రణాళిక కోసం ఏకంగా 28లక్షల కోట్ల రూపాయల సహాయాన్ని అందిస్తోంది
ఎల్‌ఐసీ. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.4లక్షల కోట్లను ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో అందించింది ఎల్‌ఐసీ. ఇవే కాకుండా ఎప్పుడు స్టాక్ మార్కెట్ కుప్పకూలితే అప్పుడు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే రంగంలోకి దూకి వేల కోట్ల రూపాయలు గుమ్మరించి మార్కెట్లు తిరిగి పుంజుకునేలా చేసే సంస్థ అది.
గత ఆర్థిక సంవత్సరంలో(2019-20) మన ప్రభుత్వానికి డివిడెండ్ గా 13586 కోట్ల రూపాయలు ఇచ్చింది LIC.32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన అతి పెద్ద భారతీయ సంస్థ ఇది.
ఇప్పటివరకూ రూ. 5.73 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎల్ఐసి. పైగా డివిడెండ్ రూపంలో ప్రతీఏడు కనీసం రూ. 500 కోట్ల పైచిలుకు చెల్లిస్తోంది. ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 3.27 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. దాదాపు రూ. 2 లక్షల కోట్లు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. మొత్తంపై ప్రభుత్వంలో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఈ రోజుకు మహా నవరత్నాలయిన బిహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, ఎన్‌టిపిసి, ఆయిల్ అండ్ నాచురల్ గాస్ కార్పోరేషన్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లలో ఎల్ ఐ సి పెట్టుబడులు పెట్టింది. వాటి ఆర్థిక పరిపుష్టికి తన సహకారం అందిస్తోంది.
Comments
Post a Comment