రీతూనందా
భారతీయ సినిమాకు దిశానిర్దేశనం చేసిన సుప్రసిద్ధ నటుడు, దర్శక నిర్మాత రాజ్ కపూర్ రెండో కుమార్తె రీతూకపూర్, రాజ్ కపూర్ అంతటి సెలబ్రిటీ వారసురాలిగా ఆమె వైభవంగా పెరిగింది.రీతూకపూర్ భర్త రాజన్ నందా. ఆయన కూడా సామాన్యుడు కాడు. ఎస్కామ్ సూప్ చైర్మన్
అయిన రాజన్ నందా దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు.. అంత సంపద ఉన్నా తనదంటూ ఏముందన్న ప్రశ్న రీతూ నందాను వేధించింది. పదిహేనేళ్ల కిందట నికితాషా హోమ్ అప్లయెన్స్ కంపెనీ స్థాపించి గ్యాస్ స్టవ్ మొదలైన వాటిని ఉత్పత్తి చేశారు.ఆ బిజినెస్ ప్రారంభమైన కొద్ది కాలం లోనే నికితాషా మూత పడింది. అప్పట్లోనే వారు విద్యుత్
తో పనిచేసే గ్యాస్ స్టవ్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. ఆ కాన్సెప్టు బాగా క్లిక్ అయింది. కాని వారి ప్లాంట్ ఉన్న హర్యానా రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మితిమీరిన పన్నులు విధించడంతో బిజినెస్ కొనసాగించలేకపోయారు.
నికితా షా మూతబడిన తర్వాత కూడా రీతూనందా ఖాళీగా కూర్చోదల్చుకోలేదు. ఆమె శక్తి నంతా బీమా రంగంపై కేంద్రీకరించారు. జీవితంలో ఏమీ చేయలేని వారే బీమా ఏజెంట్లుగా స్థిరపడతారనే దురభిప్రాయం ఒకప్పుడు
ఉండేది. కాని అదెంత ఛాలెంజింగ్ పనో చేసేవారికే తెలుస్తుంది. మొదట నేను బీమా పాలసీలను " విక్రయిస్తానని చెప్పినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. రాజ్ కపూర్ కుమార్తె, రాజన్, నందా భార్య బీమా బిజినెస్ చేయడమేమిటని ఆక్షేపిం
చారు. కాని ఎందుకో నాకు అది నచ్చింది. బీమా ఏజెంట్ కావడం కూడా గొప్ప కెరీర్ అవుతుందని నిరూపించదలిచాను" అంటారు రీతూ నందా.
అనుకున్నట్టుగానే రీతూనందా బీమా ఏజెంట్ గా
సూపర్ సక్సెస్ అయ్యారు. ఒక్కరోజులో 17,000 పాలసీలు విక్రయించి ఎల్.ఐ.సి. చరిత్రలోనే కాదు,ప్రపంచ రికార్డు
సృష్టించారు. ఆమె పేరు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయింది. ప్రపంచంలోనే తొలి వెయ్యి మంది ఇన్సూరెన్స్ దిగ్గజాలలో నీతూనందా పేరు చేరిపోయింది. ప్రస్తుతం ఆమెకు 50వేల మందికి పైగా క్లయింట్లు ఉన్నారు. అయితే వారిలో ఆమెకు - సన్నిహితులైన సినిమా వారుగాని, వ్యాపార వర్గాల వారు. కాని లేకపోవడం విశేషం.
బీమా ఏజెంట్‌గా ఎంత బిజీగా ఉన్నా రిమారి ఇండియా పేరుతో ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీని కూడా నిర్వహిస్తున్నారు. తండ్రి రాజ్ కపూర్ స్మారకంగా ఆమె - రాజ్ కపూర్ స్పీక్స్ - పుస్తకాన్ని సంకలనం చేశారు.
ప్రస్తుతం రీతూ నందా ఇన్సూరెన్స్ సర్వీసెస్ (ఆర్ఎస్ఐఎస్) కాలేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్ మెంట్ స్థాపించి, బీమా, మేనేజ్మెంట్ రంగంలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు.
అన్నట్టు రీతూ నందా మంచి అత్తగారు కూడా అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతా నందా.ఆమె కోడలు కరిష్మా
కపూర్, కరీనా రణబీర్లకు రీతూనందా స్వయానా మేనత్త.ఆమె తన 71 వ ఏట 2018లో పరమపదించారు.

Comments
Post a Comment