బంగారు కాంతులీనుతున్న LIC
సెప్టెంబర్ 1, జాతీయ జీవిత బీమా సంస్థ (LIC) జన్మదినం.భారతదేశంలోని మారుమూల పల్లె ప్రాంతాల ప్రజలందరికీ బీమా సందేశాన్ని అందించాలన్న మహత్తర లక్ష్యంతో ఏర్పాటైంది యల్.ఐ.సి.అనుకొన్న సామాజిక లక్ష్యాలను చేరుకుంటూ "ఇంతింతై వటుడింతై "అన్నట్లు దినదిన ప్రవర్ధమానమై ఒక బలీయమైన సంస్థగా ఎదిగింది.
"ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగాదగా అన్నట్లుండేది జాతీయీకరణకు ముందు పట్టాదారుల పరిస్థితి.1956జనవరిలో పార్లమెంటులో జీవిత బీమా కంపెనీలను జాతీయం చేసే బిల్లుపై ఫిరోజ్ గాంధీ,చింతామణి వ్యక్తం చేసిన అభిప్రాయాల బట్టి ఈ కంపెనీలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండేవో అర్థమవు తుంది. ఫిరోజ్ గాంధి మాటల్లో" ఈ ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాసిన మోసాలకు మించిన మోసాలు చేయడంలో సిద్ధహస్తులు ". చింతామణి దేశ్ ముఖ్ మాటల్లో చెప్పాలంటే "నియంత్రణ చట్టాలెంత పకడ్బందీగా ఉన్నా వాటిని సైతం ఉల్లంఘించగల ఘనులు ఈ ప్రైవేటు బీమా కంపెనీల అధిపతులు".ప్రైవేటు బీమా కంపెనీలు మోసాల విషయంలో కౌటిల్యుడికి పాఠాలు నేర్చగలిగిన దిట్టలని ఆనాటి ఆర్ధిక మంత్రి శ్రీ చింతామణి దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. రెగ్యులేటరీ చట్టాన్ని 20 సార్లు సవరించినా ప్రైవేటు వారి మోసాలు అరికట్టబడలేదని, సవరించిన ప్రతీసారి మరో నూతన పద్ధతిలో మోసానికి పాల్పడే వారని స్వయానా ఆనాటి ఆర్థిక మంత్రి వాపోయారు.
ప్రైవేటు కంపెనీలు బీమా వ్యాపారం ద్వారా సేకరించిన పొదుపు మొత్తాన్ని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించిన దాఖలాలు మచ్చుకి ఒకటి కూడా లేకపోగా, ఎవరు పోగేసింది వాళ్లే దిగ మింగేసి పట్టాదారుల నెత్తిన శరగోపం పెట్టడంవారికి వెన్నతో పెట్టిన విద్య.దాంతో పాలసీదారుల సొమ్ము ప్రైవేటు కంపెనీల వ్యక్తిగత పెట్టుబడిగా ఉపయోగపడేది.
ఆనాటి ప్రైవేటు కంపెనీల చేతులలో పాలసీదార్ల సొమ్ము భద్రం కాదని భావించిన ప్రభుత్వం చివరికి 1956 సెప్టెంబర్ 1న జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ఎల్‌ఐసి సంస్థ ను ఏర్పరిచింది. అయితే 254 ప్రైవేట్ కంపెనీలను విలీనం చేయగా ఏర్పాటైన ఎల్ ఐ సికి దక్కింది 75 లక్షల రూపాయల లోటు. అంటే ఎల్ ఐ సి పుట్టడమే లోటుతో పుట్టింది. ఎల్ ఐ సిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పెట్టిన మదుపు 5 కోట్లు మాత్రమే.
ఎల్ ఐ సి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సంస్థ చేపట్టిన మొదటి విషయం ఏమంటే, ప్రైవేటు కంపెనీల నుండి ఎల్‌సికి బదలాయించిన జీవిత బీమా పాలసీలకు రక్షణ కల్పించడం.ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడం.అంతేగాక కోట్లాది రూపాయలు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికావసరాలకు అందించింది. ప్రభుత్వమందించిన 5 కోట్ల చిన్నపాటి సాయంతో నేడు ఎల్ ఐ సి ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించిందంటే అతిశయోక్తి కాదు. జాతీయం చేసేనాటికి (1956) ఎల్ ఐ సి లైఫ్ ఫండ్ కేవలం 340కోట్లు మాత్రమే. ఇప్పుడది 2019 మార్చి నాటికి 29,00,000కోట్లకు చేరుకుంది.
పట్టాదారులకు అమోఘమైన రీతిలో సేవలందిస్తూ భారతంలోఆర్ధిక వ్యవస్థకు వనరుల్ని పుష్కలంగా అందిస్తున్న ఎల్.ఐ.సి.ఒక బంగారు సంస్థ. అటువంటి సంస్థ 65వ సంత్సవ సంవత్సరంలోకి అడుగిడుతోందంటే అందుకు అన్ని క్యాడర్లు
చేస్తున్న కృషే కారణమన్నది నిర్వివాదాంశం. ఇంత చక్కటి ఎల్ ఐ సిసిని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిళ్ళకు లొంగి,
" బీమా సంస్థలకు నైవేద్యంగా పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఎల్ సిని ముక్కలు చెయ్యాలని 80వ దశకంలో ప్రయత్నించి విఫలమైన ప్రభుత్వం 90వ దశకంలో మల్హోత్రా కమిటీ సిఫార్సుల పేరుతో ఎల్ ఐ సి సిని ప్రైవేటు పరం చేయాలని చూసింది.ప్రజా వ్యతిరేకతను గమనించి
ప్రభుత్వం ఎల్ ఐ సి వాటాలను అమ్మనని పార్లమెంట్ లో వాగ్దానం చేయాల్సి వచ్చింది. కానీ బీమా రంగంలోకి ప్రైవేటు బీమా కంపెనీ లను అనుమతించింది. ఇప్పటికి 23కంపెనీలు జీవిత బీమా రంగంలో ప్రవేశించి వ్యాపారం చేస్తున్నాఎల్ఐసి మార్కెట్ షేర్ ను దెబ్బతీయ లేకపోయాయి. అయిన ప్పటికీ ఐ ఆర్ డి ఎ నుఅడ్డం పెట్టుకుని దెబ్బ తీయాలని చూస్తు న్నాయి. ప్రత్యక్ష పోటీలో దెబ్బతీయలేని ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వాన్ని ఆసరా చేసు కుంటున్నాయి.
ఎల్‌ఐసికి ఉన్న సావరిన్ గ్యారంటీని తొలగించి ప్రభుత్వ దన్ను ఉండ రాదని ప్రైవేటు కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. అంతే గాక ఎల్లసికి తగినంత సాల్వెన్సీ మార్టిన్ లేద న్న పేరుతో ఎల్ ఐ సి లో ప్రభుత్వవాటా లను అమ్మకానికి పెట్టాలని ప్రభుత్వంప్రయత్ని స్తోంది. అనేక సామాజికలక్ష్యాలను నెరవేరు స్తూ అత్యంత ఉత్తమమైన ఆర్థిక సంస్థగా విరా జిల్లుతున్న ఎల్ ఐ సి ని విదేశీ పెట్టుబడిదార్ల కు కట్టబెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా న్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Comments
Post a Comment