ఉంట్ల హనుమంతరెడ్డి
నమ్మకానికి అతను ఒక చిరునామా
కదిరి యల్ఐసి లో
అతనికి ఉంది ఒక విశిష్ట స్థానం
అతనే ఉంట్ల హనుమంత రెడ్డి
ఉంట్ల హనుమంతరెడ్డి కదిరి మున్సిపాలిటీ పరిధిలో వున్న నాగిరెడ్డి పల్లె లో ఉంట్ల క్రిష్ణారెడ్డి, పార్వతమ్మ దంపతులకు 26.6.1969లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీరి నాన్న సన్నకారు రైతు. ఆయన తొమ్మిదో ఏట తల్లి దివంగతురాలైంది.
వీరి చిన్నతనమంతా తండ్రి సంపాదించే
చాలీచాలని ఆదాయంతో గడిచింది.వారిది ఉమ్మడి కుటుంబం. ప్రాథమిక విద్య పల్లె లో
పూర్తి చేశారు.పదవతరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పూర్తి చేశారు.ఇంటర్ ను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివారు. తెలుగు అధ్యాపకులు సిద్దారెడ్డి బోధన వలన తెలుగు సాహిత్యం పై మక్కువ ఏర్పడింది. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బి.ఎ.డిగ్రీని పూర్తి చేశారు. చదువు ఎక్కడా ఆపకుండా ముందుకు సాగినారు. రోజుకు ఒక నవలకు ఒక రూపాయి పెట్టి యండమూరి వీరేంద్రనాథ్ నవలలను చదివేవారు. పెళ్లి అయ్యేదాకా నిరుద్యోగిగా ఉండటంవల్ల ఎటువంటి ఆదాయం లేక డబ్బుల కోసం అవస్థలు పడేవారు. ఉదయం 5 గంటలకు వ్యవసాయానికి వెళితే రాత్రి 10 గంటలకు వచ్చేవారు. ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశ తో చాలా ప్రయత్నాలు చేశారు. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించి అన్ని విభాగాల్లో సెలక్ట్ అయ్యారు. కానీ ఆయన అవ్వ నారమ్మ నీకు పోలీసు ఉద్యోగం సూటు కాదని చెప్పింది. అంతేగాక చనిపోయిన శవాల దగ్గర కాపలా ఉండాలని ఆమె చెప్పింది. దాంతో ఆ ఉద్యోగానికి వెళ్లలేదు. మెకానిజం నేర్చుకుని మెకానిక్ కావాలని అనుకున్నారు.కానీ అది వీలు కాలేదు. నాన్నతో పాటు ఉంటూ దాదాపు 10 సంవత్సరాలపాటు తనే వంట చేస్తూ ఉండేవారు. డబ్బు మీద పెద్ద ఆశ లేకపోవడంతో వచ్చే టైం లో అదే వస్తుంది అనే ఫిలాసఫీతో ఉండేవారు.
1992 ఫిబ్రవరి14లో ఎల్ఐసి ఏజెన్సీని డెవలప్మెంట్ ఆఫీసర్ కుమారస్వామి రెడ్డి దగ్గర తీసుకున్నాడు. ఏజెన్సీ తీసుకున్న ఆరేళ్ల తరువాత
ఒక సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది.
అప్పట్లో 12పాలసీలు చేసి ఏజెన్సీ నిలుపుకోవాలి.
అనుకోని పరిస్థితుల్లో 12 పాలసీ లు ఇచ్చినప్పటికీ
11 పాలసీలు మాత్రమే పూర్తయ్యాయి.1 పెండింగ్ పడింది.ఆ సమయంలో బ్రాంచి మేనేజర్ గా
యల్ యం చౌదరి ఉండేవారు.ఆయన హనుమంతరెడ్డి ఏజెన్సీ ని పునరుద్ధరణ చేయడానికి ఒప్పుకోక పోగా "నీ లాంటి ఏజెంట్లు
యల్ ఐ సి కి అవసరం లేదన్నారు.ఆవేదన చెందిన హనుమంతరెడ్డి కసి గా మరుసటి సంవత్సరం 50పాలసీలు చేశారు.క్రమంగా 200 పాలసీలు చేసే స్థితికి చేరుకున్నారు.అదే పట్టుదలతో
ఛేర్మన్ క్లబ్ మెంబర్ స్థాయికి ఎదిగారు.
26 ఏళ్ల వయసులో 30.5.1996 లో ఉంట్ల శ్యామలతో వివాహం జరిగింది. వారికి ఒక ఒక కుమార్తె నిఖిల,ఒక కుమారుడు నితీష్ కలిగారు.
ఎల్ఐసి వ్యాపారాన్ని తన మామ సహాయం తీసుకొని పల్లెలన్నీ తిరిగి చేసేవారు. క్రమంగా పాలసీల సంఖ్యను పెంచుకుంటూ ఒకసారి 200 పాలసీలు ఒక సంవత్సరంలోనే చేశారు.
అలా క్రమక్రమంగా 2007లో డివిజనల్ మేనేజర్
క్లబ్ మెంబర్ స్థాయికి చేరుకున్నారు.స్వయంగా ఆఫీసు లో సర్టిఫికెట్ లను ధృవీకరణ చేసే అర్హత సాధించారు.అప్పుడు అతను పొందిన ఆనందం అంతాఇంతా కాదు.ఆ తరువాత 2009 లో చైర్మన్ క్లబ్ మెంబర్ స్థాయికి ఎదిగారు.
యల్ ఐ సి లో ప్రతి ఏజెంట్ ఛేర్మన్ క్లబ్ మెంబర్ స్థాయికి చేరుకోవడం అంత సునాయాసం కాదు.అది ప్రతి ఒక్కరి కల.కల కనడం సులభమే.
దానిని సాకారం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అతనికి
ఎంతో ఇష్టం. అందువల్ల నే జీవితంలో ఉన్నత శిఖరాలన్ని అధిరోహించారు.
యల్ ఐ సి ఏజెంట్ కు పాలసీలు చేస్తే కేవలం
కమీషనే కాదు.ఎన్నో మధురానుభూతులు పొందే
అవకాశాలు లభిస్తాయి.యల్ ఐ సి పెట్టిన వ్యాపార పోటీలో నెగ్గి ఎన్నో ప్రాంతాలను సందర్శించారు. నెల్లూరులో ని అరకొండ ఆంజనేయస్వామి, చిత్తూరు లోని పెంచలకోన, కర్నూలు లోని మహానంది, మంత్రాలయం, చిత్తూరు లోని కాణిపాకం మొదలైన ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలను సందర్శించారు.
రాష్ట్రంలో నే కాక ఇతర రాష్ట్రాల లో ఉన్న
వాటిని కూడా సందర్శించారు.తమిళనాడులోని వేలూరులో ఉన్న స్వర్ణ దేవాలయం, కర్నాటకలోని
హోస్పేటలో ఉన్న హంపి, హైదరాబాద్ మొదలైన వాటిని చూశారు.
తన అభివృద్ధి అధికారి పి.వి.కుమారస్వామి రెడ్డి తలకోన,మైరాడా, తిమ్మమ్మ మర్రిమాను మొదలైన ప్రదేశాలలో నిర్వహించిన ఎన్నో సమావేశాలలో పాల్గొన్నారు.
తన యూనియన్ మిత్రులతో కలసి డిల్లీ, హరిద్వార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మొదలైన ప్రదేశాలను సందర్శించారు.
ప్రస్తుతం ఆయన వయసు 51 సం.లు దాదాపు 28 సంవత్సరాలు ఎల్ ఐ సి ఏజెంట్ గాపని చేస్తూ సంస్థలో మంచి గుర్తింపు పొందారు.
ఇంకా 15 సంవత్సరాలు పాటు కొనసాగాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కుమార్తె చి!! నిఖిల ఏజి. బీఎస్సీ ఆవటి లో ఉన్న జె ఎస్ ఏ వ్యవసాయ కళాశాలలో 4వ సంవత్సరం
చదువుతున్నారు. కుమారుడు చి!!నితీష్ రెడ్డి పదవతరగతి విజయవాడ నారాయణ సి.ఒ బ్రాంచిలో చదువుతున్నారు.
ఎల్ఐసి ఏజెన్సీని బ్రతుకుతెరువు కోసంఆధారంగా చేసుకున్నారు కానీ అతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సొంతంగా వ్యవసాయం చేసి పది మందికి ఉపయోగ పడాలన్నది ఆయన కోరిక. ఇతరులకు సహాయం చేయడంలోనే అతనికి తృప్తి లభిస్తుంది.ఎవరైనా ఆయనపై నమ్మకం ఉంచితే వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా, సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉంటూ ఇతరులను గౌరవిస్తూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవించాలని ఆయన కోరిక.
Comments
Post a Comment