M.N.Srinivasulu
మల్లెపూల నరసయ్య శ్రీనివాసులు
ఇంటిపేరు మల్లెపూలు
మనసు మల్లెల సుగంధం
యల్ ఐ సి ఏజెన్సీ అతని ఆభరణం
అతనే మల్లెపూల శ్రీనివాసులు
యం.యన్ శ్రీనివాసులు కదిరిలో పూలవీధి నివాసి.ఇంటి పేరు మల్లెపూల.వీరి పూర్వీకులు మల్లెపూల సాగు చేసేవారు.వీరికి మద్దిలేరు వెనుక పూలతోట ఉండేది. యం.నరసయ్య, యం.మంగమ్మ దంపతులకు 10.3.1962 న శ్రీనివాసులుకదిరిలో జన్మించారు.
ప్రాధమిక విద్య ను జౌకుపాళెం వీధిలో ఉన్న పాఠశాలలో,బాలుర ఉన్నత పాఠశాలలో పదవతరగతి వరకు చదివారు.ఇంటర్ ను బాలుర జూనియర్ కళాశాలలో,బి.కాం.డిగ్రీని 1985లో STSN డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు.డిగ్రీ పూర్తయ్యాక ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్లాస్టిక్ కేన్ వర్క్ చేసేవారు.
జాగృతి మొదలైన పత్రికలకు కవితలను పంపేవారు. పదబంధ కేళీలు మొదలైనవాటిని పూరించి పంపేవారు.
రెస్కో లో పనిచేస్తున్న శివ శ్రీనివాసులు మంచి స్నేహితుడు. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కుమార స్వామి రెడ్డి రెస్కో లో పనిచేస్తున్న శివ తో పరిచయమైంది. ఎల్ఐసి ఏజెన్సీ కొరకు ఎవరినైనా చూపించమని అతన్నిఅడిగితే తన మిత్రుడు శ్రీనివాసులును పరిచయం చేశాడు. ఆ విధంగా రెస్కో లో పనిచేస్తున్న శివ సూచనమేరకు 1991లో ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాడు శ్రీనివాసులు.
ప్రారంభంలో వ్యాపారంలో బిజీగా ఉండడం వల్ల పెద్దగా ఎల్ఐసి వ్యాపారం చేయకపోయినా తర్వాత కాలంలో లో ఎల్ఐసి తన కెరీర్ గా తీసుకుని చేస్తూ వస్తున్నారు.
లేపాక్షి వాస్తవ్యులైన విజయలక్ష్మితో 5 .11. 1995 న లేపాక్షిలో వివాహం జరిగింది. శ్రీమతి విజయలక్ష్మి ప్రస్తుతం కదిరిలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు పునీత్ సాయి తేజ, ఒక కుమార్తె సురేఖ జన్మించారు.
పునీత్ బి ఎస్ సి స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కుమార్తె సురేఖ తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
ఎల్ఐసి ఏజెన్సీ చేయడం ద్వారా సంస్థలోనూ సమాజంలో మంచి గుర్తింపు పొందారు. అనేక కొత్త పరిచయాలు అనుభవాలు పొందారు 2005లో బ్రాంచ్ మేనేజర్ క్లబ్ మెంబర్ అయ్యారు అప్పట్నుంచి ప్లంబర్ గా నేటికీ కొనసాగుతూనే ఉన్నారుఎల్ఐసి సంస్థ పెట్టిన అనేక వ్యాపార పోటీల్లో మంచి వ్యాపారం చేసి ఎల్ఐసి తరఫున అనేక ప్రదేశాలు సందర్శించారు. ముఖ్యంగా శ్రీశైలం కర్ణాటక లో ఉన్న నంది హిల్స్, అన్నవరం, బెలుం గుహలు, తిరుపతి,మంత్రాలయం మొదలైన వెన్నో ప్రదేశాలు సందర్శించారు.డివిజినల్ మేనేజర్ ద్వారా బ్రాంచ్ మేనేజర్ ద్వారా అనేక జ్ఞాపికలు
తీసుకున్నారు.ఇటీవల కాలంలో 5 లక్షల దగ్గర నుంచి 15 లక్షల వరకు కూడా చాలా మందితో చేయించారు.
ఇటీవల 2020 మార్చి లో దేశంలోకి కరోనా
రాకముందు అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో బైపాస్ సర్జరీ చేశారు. దాంతో కొంతకాలం పాటు ఆరోగ్యం కుంటుపడింది. మళ్లీ ఇప్పుడు ఆరోగ్యాన్ని పుంజుకని తిరిగి పాలసీలు చేయడం ప్రారంభించారు. కానీ అకస్మాత్తుగా బిపి తగ్గి పోయి 30.6.2021న అంతిమ శ్వాస విడిచారు.
🥺🥺😭Rest in peace uncle. We miss uh
ReplyDeleteRest in peace 🥺
ReplyDeleteRest In peace mamayya
ReplyDelete