జీవిత బీమా కుటుంబానికి,వ్యక్తికి రక్షణ


జీవిత బీమా కుటుంబానికి,వ్యక్తికి రక్షణ    
        pc: Eenadu.net
            వర్షంలో తడిసి పోతున్నప్పుడు అయ్యో గొడుగు లేదే అనుకుంటాం. గొడుగు తెచ్చుకుంటే బాగుండేది కదా వర్షంలో తడిసే వాళ్ళం కాదు కదా అని అనుకుంటాం.అలాగే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు కొంత డబ్బు ముందుగా దాచిపెట్టుకుని ఉంటే మనకు ఉపయోగపడేది కదా అని అనుకుంటాం. అలాగే మన ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు జీవిత బీమా మనకు ఛత్రం లాగా, ఒక పొదుపు లాగా ఉపయోగపడు తుంది.
           "తను లేకపోతే తన కుటుంబానికి దిక్కెవరు" అని   ‌ఒక వ్యక్తి   ఆలోచించాడంటే  అతనికి కుటుంబం పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు. సాధారణంగా అలాంటి వ్యక్తి తను ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు జీవిత బీమా పథకాన్ని తీసుకుంటాడు.
              మామిడి చెట్లు నాటి కొంతకాలం సాగు చేసిన తర్వాత పెద్దవై ఏళ్ల తరబడి ఫలాన్నిస్తాయి .అలాగే జీవిత బీమా పాలసీ లో కూడా నెమ్మదినెమ్మదిగా కొట్టిన సొమ్ము కొంతకాలం తర్వాత మనకు పెద్ద మొత్తంగా అందుతుంది.అందువల్ల ఇది బ్యాంకులో డబ్బులు దాచుకున్నదానితోను, బంగారం కొనడంతో నూ సరితూగదు. ఇది వీటన్నిటికన్నా మించింది. భీమా ఇచ్చిన ధీమా ఇంకేది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రైతులకు పేద ప్రజలకు కార్మికులకు ఉచితంగా  రెండు లక్షలు మొదలుకొని ఐదు లక్షల వరకు ఇస్తోంది.
         జీవితంలో మనం మెదడుతో కాక మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం.తెలుసుకోవలసిన విషయం.

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality