ఎల్‌ఐసీ ఐపీఓ నిర్వహణకు 10 మర్చంట్‌ బ్యాంకులు


       pc: SlideShare.net
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) నిర్వహణకు 10 మర్చంట్‌ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీ గ్రూప్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ క్యాప్స్‌ ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్‌ఐసీ ఐపీఓ నిర్వహణకు మొత్తం 16 బ్యాంకులు పోటీపడ్డాయి. ఎంపికైన మిగతా బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, నొమురా, బోఫా సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లు ఉన్నాయని సమాచారం. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు ఈ ఏడాది జులైలో ఆర్థిక వ్యవహారాలు చూసే మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది.


(Enaadu.net,28.8.2021)

Comments

Popular posts from this blog

మందపల్లి శ్రీనివాసులు

శారదాదేవి( sarada devi)

25 steps for building a positive personality