LIC లో 10% IPO వలన LIC ప్రైవేటు అయిపోతుందా ?


LIC లో ప్రభుత్వం వాటా 5% మరియు పట్టాదార్ల వాటా 95% కదా!
 పట్టాదార్ల ప్రీమియం పెరుగుతున్న కొలదీ ప్రభుత్వ వాటా 5% కంటే తగ్గిపోతుంది కదా!
ప్రభుత్వ వాటా 5 కోట్ల రూపాయల లోనే 10% IPO కదా!
ఇంత చిన్న మొత్తం వలన ఎలా ప్రైవేటు అయిపోతుంది ?
అనే సందేహాలు కొంత మంది కి ఉన్నాయి.
వివరాలు లోకి వెళ్తే స్పష్టత వస్తుంది.

1956 లో అప్పటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం 245 ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లను జాతీయం చేసి LIC ని ఏర్పాటు చేసింది. అప్పుడు చేసిన LIC చట్టం లో పేర్కొన్నది ఏమిటంటే, LIC లో కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, ప్రతి ఏటా LIC సంపాదించిన మిగులు ( Surplus  ) లో 5% డివిడెండ్ గా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. మిగిలిన 95% పట్టాదార్ల కు బోనస్ గా చెల్లించ బడుతుంది. (2018-19 లో కేంద్ర ప్రభుత్వానికి LIC చెల్లించిన డివిడెండ్ 2660 కోట్ల రూపాయలు.)

LIC లో విలీనం అయిన 245  ప్రైవేటు కంపెనీల ఆస్తులు, ఋణాలు LIC కి బదిలీ చెయ్యబడ్డాయి. 1957 లో బ్యాలన్స్  షీట్ ( లావాదేవీలను )ను పరిశీలిస్తే, ఆస్తుల కంటే Liabilities ( చెల్లించవలసినవి ... ఋణాలు, future claims కోసం దాచవలసిన పొదుపు వంటివి ) అధికంగా ఉన్నాయి. అంటే , ఈ 245 కంపెనీ ల నుండి liabilities ని మించి నికరంగా LIC కి చేరిన ఆస్తులు ఏమీ లేవు. 

అందుచేత, LIC ఆవిర్భవించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన 5 కోట్ల రూపాయలే మూల పెట్టుబడి. ఇతర పెట్టుబడులు ఏమీ లేవు. కాబట్టి, LIC is totally owned by the Indian Government. 

LIC  పాలసీహోల్డర్లు వ్యాపారం లో భాగస్వాములు ( Shareholders ) కారు. వారు LIC యొక్క కస్టమర్లు. సంస్థ యొక్క కస్టమర్లు గా వారు తీసుకున్న పాలసీలను బట్టి వారికి LIC బోనస్ చెల్లిస్తుంది.

కాబట్టి, LIC వ్యాపారం పెరిగే కొద్దీ పట్టాదార్ల వాటా పెరిగి, ప్రభుత్వ వాటా తగ్గి పోతుందనేది పొరపాటు అవగాహన.

LIC లో మొత్తం పెట్టుబడి భారత దేశ ప్రభుత్వానిదే. అదీ 5 కోట్ల రూపాయలు. అదే 100%. 

1991 లో నూతన ఆర్థిక విధానాలు అమలు లోనికి వచ్చిన లగాయితూ LIC పై ప్రైవేటీకరణ దాడి మొదలయింది. 
 LIC పునర్నిర్మాణానికి సూచనలను చెయ్యమని గతంలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ గా పని చేసిన RN Malhotra ను PV నరసింహారావు ప్రభుత్వం నియమించింది.
LIC లో మూల పెట్టుబడి 5కోట్లు చాలా అల్పంగా ఉంది. పెట్టుబడి తక్కువ ఆస్తులు ఎక్కువ. ఇంత అల్ప పెట్టుబడి తో LIC లో డిజిన్వెస్ట్మెంట్ చెయ్యడం సాధ్యం కాదు.
ప్రభుత్వ పెట్టుబడి ని 100 కోట్ల కు పెంచి అందులో 50% అమ్మెయ్యాలని మల్హోత్రా కమిటీ సిఫార్సు చేసింది.
 
మన పోరాటం వలన LIC ప్రైవేటీకరణ ఆగింది. కానీ 1999 లో IRDA చట్టం చెయ్యడం వలన బీమా రంగంలోకి ప్రైవేటు కంపెనీలు వచ్చాయి. విదేశీ పెట్టుబడులు కూడా వచ్చాయి.

మల్హోత్రా కమిటీ సూచించినట్లు 2009 లో  LIC లో ప్రభుత్వ పెట్టుబడి 5 కోట్ల నుండి100 కోట్ల కు పెంచుతూ LIC చట్ట సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రానికి LIC ఇచ్చే డివిడెండ్ ని సర్ప్లస్ లో 5% నుండి సాల్వెన్సీ మార్జిన్ కలుపుకొని10% కి పెంచింది. దీని వల్ల పట్టాదార్ల బోనస్ తగ్గుతుందని మనం చేసిన ప్రచారం మూలంగా ప్రభుత్వం వెనక్కి తగ్గి 5% డివిడెండ్ మాత్రమే తీసుకుంటున్నది. 150% సాల్వెన్సీ మార్జిన్ ను LIC కేటాయింపు చేస్తోంది. 

ఈ చట్ట సవరణ ద్వారా LlC లో ప్రభుత్వ పెట్టుబడి 100 కోట్ల కి పెరిగింది. 10% IPO అంటే ఈ 100 కోట్ల ప్రభుత్వ పెట్టుబడి లో 10% షేర్లు ప్రైవేటు వారికి అమ్ముతారు. అంటే 10 కోట్ల విలువైన షేర్లు అమ్ముతారు, మిగిలిన 90 కోట్ల విలువైన షేర్లు ప్రభుత్వం వద్ద ఉంటాయి.

దీని వల్ల జరిగే అనర్ధాలేమిటి అంటే ,  ప్రభుత్వ పెట్టుబడి ప్రైవేటు వారికి బదిలీ అవడం మొదలవుతుంది, 40 కోట్ల పట్టాదార్ల కు లేని పెత్తనం కొద్ది మంది వ్యక్తులు చేజిక్కించు కుంటారు, యాజమాన్యం లో ప్రైవేటు వ్యక్తులు చొరబడతారు.

 ప్రైవేటు వ్యక్తులు షేర్ హోల్డర్లు అయిన తర్వాత LIC లో మొత్తం 100 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి కనుక మొత్తం షేర్ల పై ఇచ్చే డివిడెండ్10% ఉండాలని పట్టు పడతారు. దీని వల్ల ప్రస్తుతం ఇచ్చే డివిడెండ్ రెట్టింపు అవుతుంది. ఆ మేరకు పట్టాదార్ల బోనస్ తగ్గుతుంది. IPO కోసం ప్రభుత్వ పెట్టుబడి 100 కోట్ల నుండి ఇంకా పెంచాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే సర్ప్లస్ లో 10% కంటే అధిక శాతం డివిడెండ్ గా కేటాయించ వలసిన అవసరం కలుగవచ్చు. అప్పుడు బోనస్ ఇంకా తగ్గుతుంది. 

అంతే కాదు. ఇది 10% IPO. అన్ని PSU ల ప్రైవేటీకరణ మొదటి గా IPO తోనే మొదలయింది. తర్వాత దాన్ని పెంచడం జరిగింది. క్రమంగా ప్రభుత్వ పాత్ర తగ్గి ప్రైవేటు పాత్ర పెరిగింది.

IPO వలన బోనస్ తగ్గడం ఖాయం.
క్రమంగా ప్రైవేటు పాత్ర పెరగడం ఖాయం.
కాబట్టి, IPO అంటే స్వల్పగా ప్రైవేటు కి ఇవ్వడం అని మనం తేలికగా తీసుకుంటే అది మనల్ని మింగడం ఖాయం.
IPO అంటే ప్రైవేటీకరణే అని అర్ధం చేసుకోవాలి.
పట్టాదార్ల కు జరిగే నష్టాన్ని కూడా వారికి జాగ్రత్తగా తెలియపర్చి, వారి మద్దతు కూడా కూడగట్టాలి.

Comments

Popular posts from this blog

25 steps for building a positive personality

శారదాదేవి( sarada devi)

మందపల్లి శ్రీనివాసులు